మెగాస్టార్ సినిమా గురించి షాకింగ్ విషయం వెలుగులోకి… నిజంగా అది నిజమేనా..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం చిరంజీవి రెండు కొత్త సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా ఆ రెండు నిర్మాణ సంస్థలు సినిమాల గురించి అధికారికంగా ప్రకటించాయి. ఒకటి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలా నిర్మిస్తున్న సినిమా మెగా 156. రెండవది మూవీ క్రియేషన్స్ లో వశిష్ట దర్శకత్వం లో తెరకెక్కుతున్న మెగా 157 సినిమా.

ప్రస్తుతం సుస్మిత నిర్మిస్తున్న మెగా 156 సినిమా కి సంబందించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే  మెగా 156 సినిమా స్క్రిప్ట్ సరిగ్గా కుదరని కారణంగా ఆ సినిమా ని ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నపుడే ఆపేసారని గుసగుసలు వినపడుతున్నాయి. ఇక మొదట ఈ సినిమా కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడు మాత్రం ఆయన పేరు ప్రకటించలేదు.

మంచి రోజు చూసుకొని ఈ సినిమా కి సంబందించిన అన్ని వివరాలను ప్రకటిస్తారేమో అని అంత అనుకుంటున్న సమయంలో అసలు సినిమా నే ఆగిపోయింది అనే వార్త బయటకి వచ్చింది. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే నిర్మాణ సంస్థ స్పందించే వరకూ ఆగాల్సిందే. ఇక వశిష్ట దర్శకత్వం లో వస్తున్న సినిమా ని యూ. వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కాభోతుంది.