ట్విస్ట్.. బాలయ్య – బోయపాటి అఖండ 2 కాదా..!!

టాలీవుడ్ హిట్ కాంబినేషన్‌లో నందమూరి నట‌సింహ బాలయ్య – బోయపాటి కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంచనాలు ప్రేక్షకుల్లా ఉంటాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు వచ్చి హ్యాట్రిక్ హిట్‌లు అందుకున్న‌ సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్‌ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్‌లో కూడా మరో సినిమాను ఓకే చేశాడు బాలకృష్ణ. ఈ మూవీ కూడా 2024 మార్చిలోగా రిలీజ్ అయిపోతుందట. దీని తర్వాత మరోసారి బోయపాటి కాంబినేషన్‌లో బాలకృష్ణ నటించబోతున్నాడు. బాలయ్య.. బోయపాటి అఖండ సీక్వెల్ గా అఖండ 2 చేస్తున్నారని టాక్ వినిపించినా.. ప్రస్తుతం అఖండ 2 ఆలోచనను పక్కనపెట్టి నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్‌గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీని బోయపాటి.. బాలయ్య తెరకెక్కిస్తున్నట్లు తేలుస్తుంది. బాలయ్య కోరిక మేరకే బోయపాటి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ఇక అఖండ 2 స్టొరీ ఆల్రెడీ రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారట. అదే జరిగితే బాలయ్యకు పాన్ ఇండియా లెవెల్లో అఖండ 2నే మొదటి మూవీ అవుతుంది. ఇక బోయపాటి శ్రీను ప‌ని అయిపోయింది అనుకునే టైంలో సింహా సినిమాతో బాలకృష్ణ బోయపాటికి అవకాశం ఇచ్చాడు. తనకు లైఫ్ ఇచ్చిన హీరోకి వరుసగా హిట్‌లు ఇస్తూ బోయపాటి కూడా సత్తా చాటుతున్నాడు. ఇక 100వ‌ సినిమా తరువాత వరుస సినిమాలతో హిట్లను అందుకుంటున్న బాలకృష్ణ జోరు మరింతగా పెంచాడు. యువ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నాడు. ఇక ఇటీవల వీర సింహారెడ్డి తో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని తో కూడా బాలయ్య మరో సినిమాను లైన్లో పెట్టినట్టు టాక్.