న‌రేష్ ను ప‌విత్ర లోకేష్ ముద్దుగా ఏమ‌ని పిలుస్తుందో తెలుసా..?

న‌టుడు వీకె న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ రిలేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే న‌రేష్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ప‌విత్ర‌కు సైతం రెండు వివాహాలు జరిగాయి. త‌మ ముందు బంధాల‌ను తెచ్చుకుని న‌రేష్‌, ప‌విత్ర ఒక‌టయ్యారు. స‌హజీవ‌నం మొద‌లు పెట్టారు. మొన్నామ‌ధ్య వీరిద్ద‌రూ హీరో, హీరోయిన్ గా `మ‌ళ్లీ పెళ్లి` అంటూ సినిమా కూడా చేశారు. న‌రేష్, ప‌విత్ర‌ల రియ‌ల్ లైఫ్ స్టోరీకి ఈ మూవీ ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇక‌పోతే న‌రేష్‌, ప‌విత్ర జంట‌ తాజాగా ఓ టీవీలో ఈవెంట్ లో సంద‌డి చేసింది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా స్వామి రారా పేరుతో ఈటీవీలో ఓ స్పెష‌ల్ షో ప్ర‌సారం కాబోతోంది. బుల్లితెర న‌టులంతా ఈ షోలో భాగం అయ్యారు. శ్రీముఖి, హైప‌ర్ ఆది హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించారు. అలాగే ఈ షోకు గెస్ట్ లుగా న‌రేష్‌, ప‌విత్ర వ‌చ్చారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ ప్రోమోలో న‌రేష్‌, ప‌విత్రల హంగామా నెక్స్ట్ లెవ‌ల్ లో ఉంది. న‌రేష్ పువ్వు ఇచ్చిన ప‌విత్ర‌కు ప్ర‌పోజ్ చేయ‌డం.. ఆమె ఆయ‌న‌కు ముద్దు పెట్ట‌డం ప్రోమోలో చూపించారు. ఈ క్ర‌మంలోనే న‌రేష్ ను ప‌విత్ర ముద్దుగా ఏమ‌ని పిలుస్తుందో కూడా చెప్పింది. ప‌విత్ర `రాయ‌` అని న‌రేష్ ను ముద్దుగు పిలుస్తుంద‌ట‌. న‌వ‌ర‌స‌రాయ అన్న‌ది న‌రేష్ బిరుదు. అందులోని రాయ తీసుకుని ప‌విత్ర ముద్దుగా పిలుస్తుంది. ఇక ప‌విత్ర‌ను న‌రేష్ `అమ్ములు` అని పిలుస్తాడ‌ట‌.