బన్నీ-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే.. సెట్ అయ్యుంటే రచ్చ రంబోలానే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి . అయితే కొన్నిసార్లు అవి మిస్ అయి మంచి పని చేసినా.. మరికొన్నిసార్లు అవి మిస్ అయితే అభిమానులకు చాలా చాలా బాధగా ఉంటుంది . అలాంటి ఓ క్రేజీ కాంబోనే బన్నీ – సాయి పల్లవి. ఇద్దరు డ్యాన్స్ లో ఎంత స్టార్ స్టేటస్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోలల్లోకి స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ నెంబర్ వన్ డ్యాన్సర్ అని అందరూ పొగిడేస్తూ ఉంటారు . అంతేకాదు హీరోయిన్స్ లో డ్యాన్స్ చేసే హీరోయిన్స్ చాలా తక్కువ .

అయితే బాడీని స్ప్రింగ్ లాగా గిరిగిరా తిప్పేసే సాయి పల్లవి ఎలా మెలికలు తిరిగిపోతూ ఉంటుందో ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసాం . వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక. అయితే అలాంటి ఓ పెద్ద సాహసమే చేశాడు డైరెక్టర్ సుకుమార్ . సుకుమార్-బన్నీ కాంబోలో తెరకెక్కిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మొదటిగా రష్మిక కంటే ముందు సాయి పల్లవిని అనుకున్నారట డైరెక్టర్ సుకుమార్ . లేడి పవర్ స్టార్ అంటూ సాయి పల్లవికి ట్యాగ్ ఇచ్చిన సుకుమార్..ఆమె నటన కు మెచ్చి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు.

అయితే సినిమాలో ఇది చాలా మాస్ రోల్ కావడం ..పైగా మొదటి నుంచి సాయి పల్లవి కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉన్న నటించడానికి నో చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాల్లో ఓ బోల్డ్ సీన్ ఉంటుంది . పుష్పరాజ్ పాత్రలో కనిపించిన బన్నీ.. శ్రీవల్లి పాత్రలో కనిపించే రష్మిక తో ఓ రొమాంటిక్ సీన్ చేస్తాడు. ఆ సీన్ నచ్చకనే ఈ సినిమాను రిజెక్ట్ చేసింది అన్న కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. అయితే రీసెంట్గా ఈ సినిమాకి గాను బన్నీ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వరించడంతో ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి వైరల్ గా మారాయి. ఒకవేళ నిజంగా రష్మిక పాత్రలో సాయి పల్లవి నటించి ఉంటే ..వీళ్ల మద్య డ్యాన్స్ బీభత్సంగా ఉండేదని.. కచ్చితంగా మరిన్ని రికార్డులను కొల్లగొట్టేదని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి ఈ క్రేజీ కాంబో ని ఏ డైరెక్టర్ సెట్ చేస్తారో.. అభిమానుల కోరికను ఎప్పుడు తీరుస్తారో..?