బిగ్‌బాస్-7 షోలో శృంగారం టాపిక్.. అతడి చెంప చెల్లుమనిపించిన లేడీ కంటెస్టెంట్..

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో తక్కువ సమయంలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది ఈ షో. 14 మంది కాంటెస్టెంట్స్ తో ఆదివారం రోజు ప్రారంభం అయిన ఈ షో లో మొదటి రోజే ఒక షాకింగ్ విషయం జరిగింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా లో ఈసారి కంటెస్టెంట్స్ గా సీరియల్ నటి ప్రియాంక జైన్, హీరో శివాజీ, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభశ్రీ, నటి శకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి,యూట్యూబర్ టేస్టీ తేజ,నటుడు గౌతమ్ కృష్ణ, నటి రతికా రోజ్, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్ దీప్ లు ఉన్నారు.

అయితే వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో కొందరు మాత్రమే స్పెషల్ గా నిలిచారు. వారిలో సీనియర్ నటి శకీలా ఒకరు. ఇండస్ట్రీ లో చాలకాలం తనధైన స్టైల్ లో సినిమా లు చేసి ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని సంపాదించుకున్నారు శకీల. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్ని గొప్ప పనులు చేస్తున్నారు అనేది మాత్రం ఈ షో ద్వారానే అందరికి తెలిసింది. ముఖ్యంగా ఆమె ఏ.వి చూసి చాలామంది ఎమోషనల్ అయ్యారు. అలానే ఇంట్రెస్టింగ్ గా ఉన్నవాళ్లలో ఇంకోవ్యక్తి టేస్టి తేజ. ఇతను జబర్దస్త్ మాజీ కమెడియన్, యూట్యూబర్. ఇతను కుడా తన స్టైల్ లో అతని ప్రొఫెషన్ తెలిసేలా డ్రెస్ పై ఫుడ్ ఐటమ్స్ ని ప్రింట్ చేయించుకొని మరీ వేసుకొని వచ్చాడు.

తేజ హౌస్ లోకి ఏంటర్ అవ్వగానే పరిచయం ఉన్న తోటి కంటెస్టెంట్స్ అందరూ దెగ్గరకి వెళ్లి పలకరించారు. ఇంతలోనే అతనికి శకీలా కనపడగానే ‘ మేడం మేడం మిమల్ని చూడలేదు ‘ అని శకీలా తో అనగానే ఆమె వెంటనే ఏంట్రా ఇంత పెద్ద ఒళ్ళు ఉంటే కనిపించలేదా అంటూ అతనిపై సెటైర్ వేస్తుంది. ఆ తరువాత తేజ ‘ మేడం శకీలా గారు చిన్నప్పటినుండి మీ సినిమాలు చూస్తూ పెరిగాను నేను మీకు పెద్ద ఫ్యాన్ ని మేడం ‘ అని అంటాడు. అతను అలా చెప్పగానే వెంటనే శకీలా అతని చెంప మీద ఒకటీస్తూ ‘ ఏరా చిన్నప్పుడు ఎవరైనా నా సినిమా లు చూస్తారా ‘ అని వాయిస్తుంది. ఇదంతా సరదాగా జరిగినప్పటికి ఆడియన్స్ మాత్రం శకీలా అన్న మాటలకూ ఫిదా అవుతున్నారు.