అల్లు అర్జున్ పెద్ద అవకాశవాది.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..!!

టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో బన్నీ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పకపోవడమే ఈ ట్రోలింగ్‌కు కారణం.

అంతకుముందు రెండురోజుల వరకు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉన్న బన్నీ.. తీరా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున.. కనీసం విషెస్ కూడా చెప్పలేదు. పవన్ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే బన్నీకి నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విషెస్ చెప్పాడు. దీంతో బన్నీ తెరపై మెగా ఫ్యాన్స్ కారణంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

“అవకాశవాది అంటూ… నేషనల్ అవార్డు రావడంతో బిల్డప్ ఎక్కువైందంటూ.. రేవు దాటాక తప్పతగిలేసే రకం” అంటూ గోరంగా తిడుతున్నారు. చిరు ఫ్యామిలీ కాకపోయి ఉంటే ఇండస్ట్రీలోకి అంత గ్రాండ్ ఎంట్రీ ఉండకపోయేదని.. తెలుగు సినిమా అభిమానులు బన్నీని చిరు ఫ్యామిలీ హీరో గానే గుర్తించారని అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి విష్ చేసి ఉండొచ్చని మరికొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు బన్నీ విష్స్‌ చెయ్యకపోవడం పెద్ద వివేదానికే దారితీసింది.