ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పక్కలోకి రమ్మన్నాడు.. సింగర్ ప్రణవి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

సినీ ఇండస్ట్రీలో అన్ని చోట్ల క్యాస్టింగ్ కౌచ్ ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆఫర్లు రావాలంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలను సుఖ పెట్టాలని వాళ్ళ కోరికలు తీర్చాలని ఇప్పటికే చాలామంది న‌టులు మీ టూ ఉద్యమం ద్వారా తెలియజేశారు. ఇక‌ కేవలం ఇలాంటి సమస్యలు ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కు మాత్రమే కాదు సింగర్స్ కి కూడా ఎదురవుతాయని రీసెంట్గా బయటపడింది సూపర్ స్టార్ సింగర్ ప్రణవి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బంది గురించి చెప్పుకొచ్చింది.

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న సింగర్ ప్రణవి ఎన్నో మంచి పాటలకు తన గాత్రాన్ని అందించి కోట్లాదిమంది ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంది. ఇక కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఒక పాపకు జన్మనిచ్చిన ప్రణవి ప్రజెంట్ మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రణవి మాట్లాడుతూ తన కెరీర్ స్టార్టింగ్‌లో పడిన ఇబ్బందుల గురించి ఓపెన్ అయింది. తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ డైరెక్టర్ చాలా ఇబ్బంది పెట్టాడని వివ‌రించింది.

నీ గొంతు చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నాడు.. అవకాశం ఇస్తానని ప్రామిస్ చేశాడు.. కానీ తన సినిమాలో పాట పాడాలంటే ఓ రోజు మొత్తం తనతో గడపాలంటూ కండిషన్ పెట్టాడని.. అతడు ఆ మాట అనడంతో నాకు మ్యాటర్ అర్థమైంది చెప్పు తెగిపోద్ది.. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి మరీ లేచి వచ్చేసాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కేవలం ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రావాలంటేనే కాదు అమ్మాయిలు ఏ ఫీల్డ్ లో ఇండస్ట్రీలో ఎదగాలన్నా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనే అంశంపై క్లారిటీ వచ్చేసింది. ఇక‌ ప్రస్తుతం ప్రణవి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.