తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీ.. బీజేపీ కొత్త ప్లాన్ అదిరిపోయింది గా..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు బీజేపీ అగ్రనాయకత్వం అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అతి త్వరలోనే రజీనీ గవర్నర్గా నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రజీని గవర్నర్ చేయడం ద్వారా సౌత్ ఇండియాలో ఆయన క్రేజ్ ని తమ పార్టీకి కలిసి వస్తుందని ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ను కట్టడి చేయవచ్చు అని బిజెపి నాయకత్వం బాగా నమ్ముతుంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రానున్న సమయంలో ఇక్కడ ప్రభుత్వానికి గవర్నర్ మధ్య ఘర్షణ వాతావరణం నడుస్తుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలపై ఎంతో మంచిపట్టున్న రజినీకాంత్ ను తెలంగాణ గవర్నర్గా పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే రజనీకాంత్ తమ్ముడు గవర్నర్ పదవి ఇస్తానంటే రజిని కచ్చితంగా తీసుకుంటాడని చెప్ప‌డంతో ఈ వార్తల్లో బలం చేకూరింది. రజీని తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా వస్తాడా.. లేక తన సొంత రాష్ట్రానికే గవర్నర్గా నియమించబడతారా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.