విజయ్ తో లిప్ లాక్”..సమంత పెట్టిన ఏకైక కండీషన్ ఇదే..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. హీరోయిన్ సమంత కలిసి నటించిన సినిమా ఖుషి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ ని అందుకోవడమే కాకుండా మేకర్స్ కి లాభాలు తీసుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది . విజయ్ సమంత రొమాన్స్ సినిమాలో టూ హాట్ గా ఉండడం యువతకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది

అయితే నిజానికి సమంత విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేయడానికి శివనిర్వాణ కు ఒకే ఒక కండిషన్ పెట్టిందట . అది కూడా శివ నిర్వాణ మంచి కోసమే. విడాకులు తీసుకున్న తర్వాత తనను సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు మీకు తెలిసిందే .. ఒకవేళ ఇప్పుడు నేను ఈ సినిమా యాక్సెప్ట్ చేసినా..? విజయ్ తో కొంచెం రొమాన్స్ చేసినా..? హద్దులు మీరినా ..? నాతోపాటు మిమ్మల్ని విజయ్ దేవరకొండ ని కూడా ట్రోల్ చేస్తారు”.

” విజయ్ దేవరకొండకు అలాంటి ట్రోలింగ్ కొత్త కాదు ..అలాంటివి బాగా ఎదుర్కొంటాడు ..కానీ మీకు అది ఓకేనా..? మీరు అలాంటి ట్రోలింగ్ బాధలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా ..? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించిందట. శివనిర్వాణ సైతం అలాంటి ట్రోలింగ్ కి నేను బాధపడను భయపడను అంటూ చెప్పాకనే ఆమె ఈ సినిమాకు సైన్ చేసిందట”. అనుకున్నట్టే ఈ సినిమా తర్వాత వాళ్లపై హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది . కానీ సమంత – విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు..!!