తాను చచ్చిపోతాను అని శ్రీదేవికి ముందే తెలుసా..? సరిగ్గా నెల రోజుల ముందే అలా జరిగిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కానీ అతిలోక సుందరి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు శ్రీదేవి.. తన అంద చందాలతో నటనతో సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు మకుటం లేని మహారాణిగా ఏ లేసిన ఈ బ్యూటీ శ్రీదేవి ఎన్ని సినిమాల్లో నటించిందో.. ఎన్ని అవార్డులు అందుకుందో లెక్క చెప్పనవసరం లేదు. కాగా ఓ పెళ్లి కోసం అటెండ్ అయిన శ్రీదేవి దుబాయిలో ఓ హోటల్లో కాలుజారి పడి బాత్ టబ్ లో మరణించిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇది మరణం కాదు ఎవరో కావాలనే ఆమెను హత్య చేశారు అని జనాలు ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు . ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది . అయితే సరిగ్గా శ్రీదేవి మరణించే నెల రోజుల ముందే శ్రీదేవి గుడికి వెళ్ళినప్పుడు ఓ పండితుడు ఆమెకు “మీకు త్వరలోనే ప్రమాదం ముంచుకో రాబోతుంది ” అంటూ హింట్ ఇచ్చేసాడట .

అంతేకాదు మీరు తప్పించుకోలేరు ..మీ టైం దగ్గర పడింది అంటూ కూడా చెప్పుకొచ్చారట . అయితే మొదటి నుంచి పెద్దగా ఇలాంటివి నమ్మని శ్రీదేవి .. ఆ విషయాలను లైటుగా తీసుకునిందట ..కానీ ఎందుకో డౌట్ వచ్చి ముందుగానే తన ఆస్తి వివరాలను తన ఇద్దరు కూతుర్లకు టోటల్గా వివరించిందట. ఒకవేళ తాను మరణిస్తే పిల్లలకు దక్కే హక్కుల గురించి కూడా పూర్తిగా ఆమె వాళ్లకు వివరించిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!