ఆ దేశంలో ” చంద్రముఖి 2″ థియేటర్స్ వద్ద ప‌డిగాపులు కాస్తున్న ఫ్యాన్స్ (వీడియో)

గతంలో రజినీకాంత్ నటించిన ” చంద్రముఖి ” మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నయనతార, ప్రభు, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇదే మూవీకి సీక్వెన్స్ గా ” చంద్రముఖి 2 ” ఈనెల 2న ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది.

బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్, లారెన్స్ లీడ్ రోల్స్ లో వడివేలు, రాధిక, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్, శృతి డాంగే కీలక పాత్రలో నటించారు.చంద్రముఖి పాత్రలో కంగనా రానౌత్ ఒదిగిపోగా… పార్ట్ 1లో లాగానే బస‌వయ్యగా మెప్పించిన స్టార్ కమెడియన్ వడివేలు.. మళ్లీ ఈ సినిమాలో అదే పాత్రలో కనిపించాడు.

దీంతో ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ మలేషియాలో థియేటర్స్ వద్ద పడికాపులు కాస్తున్నారు. లైన్లో నిల్చుని వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి చంద్ర‌ముఖి – 2 మేనియా మ‌తేషియాలో ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.