ఓ భారీ ప్రాజెక్ట్‌కు నో చెప్పిన శ్రీ లీల.. కారణం అదే..!!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం శ్రీ లీల పేరు టాలీవుడ్ మొత్తం మారుమోగిపోతుంది. ఏ సినిమాలో చూసిన శ్రీ‌లీల‌ నటిస్తుంది. అడిగినవారు అడిగినట్టు ఎవరికీ నో చెప్పకుండా డేట్లు ఇచ్చేస్తుంది. యంగ్ బ్యూటీ పగలు, రాత్రి ఏదో విధంగా టైమ్‌ అడ్జస్ట్ చేస్తూ షూటింగు చేస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటుంది. అంతే తప్ప ఈ సినిమా చేయను ఆ సినిమా చేయను అని నో చెప్పడం లేదు.

ఒకే హీరోతో లేదా ఒకే బ్యానర్ లో 2,3 సినిమాలకు ఒకే చేస్తున్న శ్రీ లీల మంచి సినిమా.. పెద్ద సినిమా.. భారీ బ్యానర్ లో వస్తున్న సినిమాలు అయితే ఇక నో చెప్పే అవకాశం లేదంటుంది. అలాంటిది ఓ భారీ బ్యానర్ లో పెద్ద హీరో సినిమాకు మాత్రం శ్రీ లీల నో చెప్పింది అంటూ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి ఈ సినిమాకు శ్రీ లీల నటించాలనుకుందట. యూత్ సెన్సేషనల్ హీరో మంచి డైరెక్టర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు ముందుగా రష్మిక హీరోయిన్గా అనుకున్నారు.

కానీ తర్వాత శ్రీ‌లీల‌నే ఈ సినిమాకు హీరోయిన్ అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు శ్రీ లీల చేయడం లేదట. తను ఇప్పుడు డేట్స్ బిజీగా ఉండి అడ్జస్ట్ చేయాలని కారణంతో ఈ సినిమా నుంచి తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. కానీ శ్రీ లీల ఇలా డేట్‌లు అడ్జస్ట్ చేయలేదని చెప్పడమే ఆశ్చర్యం. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో డేట్ అడ్జస్ట్ కాకపోవడమే రీజనా..? లేదా వేరే రీసన్ ఏదైనా ఉందా..? అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.