సినిమా ఇండస్ట్రీలో చాలామంది జంటలు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ ముచ్చట తీరాక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే . కొన్నిసార్లు అదృష్టం కలిసొచ్చి విడాకులు తీసుకుంటే.. మరి కొన్నిసార్లు అదృష్టం కలిసి రాక విడాకులు తీసుకుంటూ ఉంటారు.. కొంతమంది విడాకులు తీసుకున్నాక ఏ ప్రాబ్లం లేకుండా లైఫ్ లో బిందాస్ గా సెటిల్ అయిపోతూ ఉంటారు . కానీ మరికొంత మంది మాత్రం లైఫ్ని బతకడం వేస్ట్ రా బాబు అన్నంతస్థాయికి డౌన్ ఫాల్ అయిపోతారు . అదే లిస్టులోకి వస్తాడు అక్కినేని మేనల్లుడు గా పాపులారిటీ సంపాదించుకున్న తెలుగు హీరో సుమంత్ .
తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది టైంలోనే క్రేజ్ సంపాదించుకున్న ఈ సుమంత్ – కీర్తి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే ఏం జరిగిందో ఏమో కానీ పెళ్లి చేసుకున్న చాలా తక్కువ టైంలోనే విడాకులు తీసుకున్న వీళ్ళు .. ఆ తర్వాత దూరం దూరంగా వెళ్లిపోయారు. కీర్తి రెడ్డి బెంగళూరుకు సంబంధించిన .. ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుని లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది .
కానీ సుమంత్ మాత్రం పెళ్లి పెటాకులు లేకుండా సింగిల్గానే ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవుతున్న తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. విడాకులు తీసుకున్న కాని కీర్తి రెడ్డితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాను ..టచ్ లో ఉన్నాను అని చెప్పడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు విడాకులు తీసుకున్న మేము మంచి స్నేహితులుగా ఉన్నామని .. ఇప్పటికీ మేము మాట్లాడుకుంటున్నామని .. టచ్ లోనే ఉన్నామని చాటింగ్ చేసుకుంటాం.. కాల్ చేస్తాం విషెస్ అందించుకుంటాము అని చెప్పుకొచ్చారు . దీంతో విడాకులు తీసుకున్న కూడా మాజీ భార్యతో ఇంత ప్రేమగా ఉండొచ్చా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది..!!