బుజ్జిగాడు త‌ర్వాత త్రిష‌తో న‌టించ‌న‌ని చెప్పిన ప్ర‌భాస్‌… ఇద్ద‌రి మ‌ధ్య ఇంత జ‌రిగిందా ?

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడుగా తెలుగులో ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. తర్వాత ఎన్నో సినిమాలు నటించి రెబల్ స్టార్ గా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. అదే సమయంలో ప్రభాస్ తన కెరీర్లో ఎందరో హీరోయిన్లతో నటించాడు.

Rana and Trisha | When Prabhas openly hinted Rana Daggubati to get back  with his ex, Trisha Krishnan at Koffee With Karan

అలాంటి హీరోయిన్లలో త్రిష కూడా ఒకటి. ప్రభాస్- త్రిష కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. ముందుగా వీరి కాంబినేషన్లో పౌర్ణమి సినిమా వచ్చింది. తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బుజ్జిగాడు సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ఏదో నడుస్తున్నట్లు రూమర్లు బయటికి వచ్చాయి అలానే ప్రభాస్ తో మాత్రమే కాకుండా త్రిష మరి కొంతమందితో రిలేషన్లో ఉన్నట్లు కూడా వార్తలు బయటకు వచ్చాయి.

 

అంతేకాకుండా ప్రభాస్ స్నేహితుడైన రానాతో కూడా త్రిష డేటింగ్ చేస్తున్నట్టు ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే వీరిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రభాస్, రానా ఇద్దరితో త్రిష రిలేషన్ పెట్టుకున్న విషయం తెలిసింద‌ని… దాంతో ఆమెని వాళ్ళిద్దరూ కూడా వదిలేసినట్లు పలు వార్తలు వినిపించాయి. తర్వాత కొన్ని రోజులకు త్రిషతో కలిసి రెండు సినిమాల్లో నటించే అవకాశం ప్రభాస్ కు వచ్చినా వద్దని చెప్పేవాడట.

 

ముందుగా బాహుబలి సినిమాలోని తమన్నాకి బదులుగా ముందు త్రిషని తీసుకోవాలని అనుకున్నారట.. కానీ ప్రభాస్ ఆమెను ఎదుర్కోవటంలో ఇబ్బంది పడతానని వద్దని తమన్నాను తీసుకోమని చెప్పారట. అదేవిధంగా రాధేశ్యామ్‌ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్గా త్రిషని ముందుగా తీసుకున్నారట. కానీ ప్రభాస్ డైరెక్టర్ కి వద్దని చెప్పడంతో ఆమెని పెట్టలేదట. ఆ విధంగా ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రను తీసేశారు. ఈ విధంగా త్రిషతో ప్రభాస్ సినిమాలు చేయడం మానేశాడు.