వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన జవాన్.. పండ‌గ చేసేకుంటున ఫ్యాన్స్‌..

బాలీవుడ్ భాద్‌షా షారుక్ ఖాన్ తాజాగా నటించిన మూవీ జవాన్. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నయనతార హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అట్లి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా కేవలం 18 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికోట్ల వసూళ్ళ‌ను సాధించి కొత్త రికార్డును సృష్టించింది.

ఈ సినిమాతో ఒకే ఏడదిలో రెండు వెయ్యి కోట్ల కలెక్షన్ దాటిన సినిమాల్లో నటించిన ఏకైక హీరోగా షారుక్ ఖాన్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది మొద‌ట్లో విడుదలైన షారుక్ ఖాన్ పఠాన్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభించిన సంగతి తెలిసిందే. వేయికోట్ల మైలురాయని దాటింది. తాజాగా జవాన్ తో ఈ రికార్డును షారుక్ రీ బ్రేక్ చేశాడు.

భవిష్యత్తులో ఏ హీరో అయినా ఈ రికార్డును అధిగమించడం చాలా కష్టమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన జవాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల బీభత్వాన్ని సృష్టించింది. ప్రస్తుతం ఇ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఇక ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో షారుక్ ఖాన్ డుంకి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రభాస్ స‌లార్‌ సినిమాకు పోటీగా రిలీజ్ అవుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.