ప్రభాస్ – శ్రీ లీలా క్రేజీ కాంబోలో మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోల అందరి సినిమాల్లోనూ వరుసగా అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల మరో క్రేజీ కాంబోలో హీరోయిన్గా సెట్ అయిందంటూ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ జంటగా శ్రీ లీల నటించబోతుందట.

అను రాగవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి సీతారామమ్‌ సినిమా తరువాత హను రాఘవపూడి తో ప్రభాస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పర్ఫెక్ట్ అయిన కథ‌ను సిద్ధం చేసుకునే పనిలో ఇన్నాళ్లు నిమగ్నమయ్యాడు డైరెక్టర్. అయితే ఇప్పుడు ఆ కథ ఓ కొలిక్కి రావడంతో హీరోయిన్ కోసం స‌ర్చింగ్‌ మొదలైందట. హను రాఘవపూడి ఇది ఒక ప్రేమ కథ కావడంతో ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్గా పెట్టాలనుకున్నాడట.

కాని చివరకు ఆ అవకాశం శ్రీ‌లీలకి వచ్చినట్లు తెలుస్తుంది. శ్రీ లీలతో నటించడానికి ప్రభాస్ కూడా ఓకే చేశాడని. ఇటీవల శ్రీ లీలకు దర్శకుడు కథ వినిపించాడని తెలుస్తుంది. శ్రీలీలకి కూడా ఆ కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.