ఆత్మహత్య ధోరణి డిఎన్ఎ నుంచి సంక్రమిస్తుందా..?విజయ్ ఆంటోనీ కూతురు కూడా అలానే..

ఆత్మహత్య ధోరణి అనేది కూడా జన్యుపరంగానే వస్తుందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది పిల్లలు మానసిక ఒత్తిడితో డిప్రెషన్ కు లోన్ అవుతున్నారని చెప్పిన ఆయ‌న‌ నటుడు సినీ హీరో విజయ్ ఆంటోనీ కుటుంబంలో అతిని చిన్నతనంతోనే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పుడు అతని కూతురు 16 వయసులోనే ఆత్మహత్య చేసుకుంది దీన్ని బట్టి జన్యుపరంగా కూడా ఆత్మహత్య దోరణి ఉంటుందని చెప్పవచ్చు అంటూ వివరించాడు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక పిల్లల్లో ఆ ధోరణి మరింతగా పెరిగిందని.. ఫోన్లకు ఎడిట్ అయిపోతున్నారు.

ముఖ్యంగా వారు ఈ ఆత్మహత్య ధోరణి దరిదాపుల్లోకి వెళ్ళకుండా ఉండాలి.. ఫోన్ అడిక్షన్ మానిపించాలంటే ఎలా అనే అంశంపై నవీన్ నడిమింటి ఏం చెప్పారంటే.. చీకటి గదిలో పిల్లలను ఎక్కువసేపు ఉంచకూడదు. సెల్ఫోన్లకు ఎడిట్ అయిపోతే డిప్రెషన్, ఎగరేషన్ వచ్చేస్తాయి. రెండేళ్ల పిల్లలు కూడా సెల్ఫోన్ చేతికి ఇవ్వకపోతే అన్నం తినడం మానేస్తున్నారు. ఆరుబయట ఎంత ఆడుకుంటే అంత పాజిటివ్ వ్యక్తిత్వం అలబడుతుంది. అలాగే పిల్లలతో పేరెంట్స్ కూడా ఒక మంచి క్వాలిటీ టైం మైంటైన్ చేయాలి. అలానే పిల్లలు ముందు పనికిరాని గాసిప్‌స్‌ మాట్లాడుకోకూడదు. పిల్లల పెరుగుదలకు అతికేలకమైన వయసు 1 నుంచి 5 సంవత్సరాలు. అంటే ప్రీస్కూల్ పిల్లల్లో పెరుగుదల అన్నది వారి తినే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది.

మా పిల్లలు ఇది తినరు అది తినరు ఏది తినడానికైనా పేచి పెడుతూ ఉంటారు అని చాలామంది అంటుంటారు. ఏడాది నిండేటప్పటికీ పిల్లలు దాదాపు నడక బ‌చ్చేస్తుంది. తమంతటి తాము తిరుగుతూ ఎక్కడేమున్నాయి అన్ని చక్కబెడుతూ ఆటల్లో మునిగిపోయి తిండిని అసలు పట్టించుకోరు. పేచి పెడుతూ ఉంటారు. మూడేళ్ల వయసులో పిల్లలు ప్రీస్కూల్లో చేర్చడంతో అక్కడ మిగతా పిల్లలు తినే ఫుడ్ చూసి అదే బాగుంటుంది, నా ఫుడ్ బాగోదు అని భావిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏడాది ఏడాదికి మారే అలవాట్లు. కాబట్టి వీటిని గుర్తుంచుకొని ముందుకు వెళ్లాలి. కొన్ని ఆహ‌రాలు వాసనలు పెద్దవారికి లాగే పిల్లలకు కూడా పడవు.

అది తిను ఇది తిను అని ఒత్తిడి చేసే బదులు వారికి ఇష్టమైన రీతిలోనే ఫుడ్ ను సమయానికి అందిస్తూ ఉండాలి. తినిపిస్తే ఎక్కువ తింటాడని బాబు తింటే తక్కువ తింటాడని నోట్లో బలవంతంగా కుక్కే ప్రయత్నం చేయకండి. ఆహారం వేస్ట్ అయినా వాళ్ళంతట వాళ్ళు తినే విధంగా ప్రోత్సహించండి. రోజుకో రకం ఫుడ్ పెడితే వారు దానిని ఒక ఆటలా భావించి సమయానికి తింటారు. ఇక వాడు తినే ఆహారంలో సరిపడా పోషకాలు కూడా ఉండేలా చూసుకోవాలి. లేదంటే వారి పెరుగుదల సరిగా ఉండదు పిల్లలకు పాలు పండ్ల రసాలు చాలా ఎక్కువగా ఇస్తూ గనాహారాన్ని చాలా తక్కువగా పెడుతూ ఉండాలి. వివిధ రకాల ఆహార పదార్థాలు లేకుండా ఒకే మూసాలో ఆహార పదార్థాలు పెట్టడం వల్ల ఏ విటమిన్, ఐరన్, డి విటమిన్, బి కాంప్లెక్స్ లాంటి విటమిన్ లోపాలు ఏర్పడుతూ ఉంటాయి.

వాళ్ళు బయటకు వెళ్లి ఆడాలనుకుంటారు. ఇక ప్రీస్కూల్ పిల్లలకు తిండి ఒక ఆట వస్తువులా ఉంటుంది. వారికి నచ్చిన ఆహారాన్ని పెడితే వారు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇష్టం , అయిష్టం అనేది కూడా వారిలో ఉంటాయి. వయసుకు ఉండాల్సిన ఎత్తు ఉండాల్సిన బరువు సరిగా వారిలో ఉండేలా ప్రయత్నించాలి. వారికి ఏమాత్రం ఖాళీ దొరికిన సెల్ ఫోన్ కి ఎడిట్ అయిపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ లో గేములు, వీడియోలకు ఇష్టపడి పిల్లలు స్నేహితులతో కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. పిల్లలు మనోవికాసానికి బయట స్నేహితులతో ఆడుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా వారితో ఏదోరకంగా సమయాన్ని కేటాయించాలి.

అది వారికి అమూల్యమైన సమయంగా వారు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సమయంలో వారి ఫోన్ నుంచి మెల్లమెల్లగా దూరం అవుతారు. లేదా పిల్లలు సెల్ఫోన్ లాంటి విష సంస్కృతి డిప్రెషన్కు గురై ఆత్మహత్య ద్వారానే దరిదాపుల్లోకి వెళ్తారు. తల్లితండ్రుల గురించి ఆలోచించాలని బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం తల్లిదండ్రులు సాహిత్యం ద్వారానే పిల్లలకు వస్తుంది. పిల్లలు బాగుండాలన్న వారి వ్యక్తిత్వం సరిగా ఉండాలన్న తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటుందని నిపుణుడు చెబుతున్నారు. తల్లిదండ్రులను మించిన స్నేహితులు శ్రేయోభిలాషులు పిల్లలకు ఎవరు ఉండరు. ఇక పేరెంట్స్ పై ప్రేమ గౌరవం ఉండేలా పిల్లల్ని పెంచాలి. అంతేకానీ భయం కాదు అందుకే ముందు తల్లిదండ్రులు మారాలి. పిల్లలను అర్థం చేసుకోవాలి ఇక పిల్లలకు టీనేజ్ వచ్చేంతవరకు తల్లిదండ్రులు రోజు కొంతసేపైనా వారితో క్వాలిటి టైమ్ స్పెండ్ చేయాలి.