చిరంజీవి కంటే ముందే సురేఖకు ఆ హీరో తో పెళ్ళి జరగాల్సిందా..? ఆపేసింది ఎవరంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పురాతన విషయాలను తవ్వి లోడి మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . అయితే గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు సంబంధించిన వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్త కావడంతో జనాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . మనకు తెలిసిందే చిరంజీవి సురేఖ ల జంట ఇండస్ట్రీలో ఉండే అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తారు. ఎంతో మంది జంటలకు ఆదర్శంగా ఉన్నారు.

అయితే చిరంజీవి కంటే ముందే సురేఖకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోని పెళ్లి చేసుకునే ఛాన్స్ వచ్చిందట . అల్లు రామలింగయ్య గారి ఇంటికి స్వయాన ఆ హీరో తండ్రి వచ్చి సురేఖను తన కొడుక్కి ఇవ్వమంటూ అడిగారట . అప్పటికే పెద్ద స్టార్ హీరో కావడం పైగా ఆస్తిపాస్తులు ఉండడంతో రామలింగయ్య గారు కూడా సురేఖను ఆ హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలని భావించారట . కానీ జాతకాలు చూపించగా జాతకాలు కుదరలేదని.. వీళ్ళ జాతకాలు కుదరకుండా పెళ్లి చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని ..సంతాన సమస్యలు ఉంటాయని చెప్పుకొచ్చారట పండితులు.

ఈ క్రమంలోనే కూతురు భవిష్యత్తు కోసం ఆ స్టార్ హీరో తండ్రికి రామలింగయ్య గారు నో చెప్పారు . ఆ తర్వాత వెంటనే చిరంజీవి సంబంధం రావడం.. రామలింగయ్య గారికి తెగ నచ్చేయడం ..సురేఖకి కూడా చిరంజీవి నచ్చేయడంతో టకటక పెళ్లి జరిగిపోయింది. లైఫ్ లో సెటిల్ అయిపోయారు . ఆ అదృష్టాన్ని ఆ విధంగా చిరంజీవి దక్కించుకున్నాడు . ఏ మాటకు ఆ మాట సురేఖ దొరకడం నిజంగా చిరంజీవి అదృష్టమని చెప్పాలి . చాలామంది సురేఖని ఇండస్ట్రీలో పోగిడేస్తూ ఉంటారు . ఎక్కువ హెల్పింగ్ నేచర్ అని ఎవరు బాధపడిన చూడలేదని ..ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్స్ కూడా చెప్పుకొచ్చారు..!!