టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రకుల్ ప్రీతిసింగ్.. తెలుగులో ఒకానొక సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చాలామంది హీరోల సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉండేది. కానీ ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి.. దింతో బాలీవుడ్ లోనే అడపా దడపా సినిమాలలో నటిస్తున్న రకుల్ ప్రీతిసింగ్ అక్కడే తన బాయ్ ఫ్రెండ్ జాకీ భజ్ఞ నితో కలిసి పలు సినిమాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ ,టాలీవుడ్ లో అయితే ఇమెను పెద్దగా పట్టించుకోలేదు.. మహారాష్ట్రలో జరిగిన ఒక పొలిటికల్ ఈవెంట్లో రకుల్ ప్రీతిసింగ్ మెరవడం జరిగింది. గతంలో చాలా సినిమాలు చేసిన రకుల్ ప్రీతిసింగ్ ఇప్పుడు ఇలాంటి దుర్గాల పరిస్థితులు ఎదుర్కోవడం చాలా దారుణం అంటూ పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు .సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఫోటోల వల్ల కూడా ఈమె కెరియర్ను పెద్దగా కొనసాగించుకోలేకపోతోంది.
అసలు ఇప్పటివరకు రకుల్ ప్రీతిసింగ్ ఏ తెలుగు నిర్మాత కూడా సంప్రదించలేదనీ సమాచారం..ఏదో ఒక భాషలో ఏదో ఒక సినిమాలో అవకాశం వస్తే ఈ అమ్మడు సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు దాదాపుగా రెండు మూడు ఏళ్లుగా భారీ సినిమాల్లో నటించే అవకాశాలను కోల్పోయింది. దీన్ని బట్టి చూస్తే రకుల్ ప్రీతిసింగ్ రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల వైపు అడుగులు వేసి అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.