ఉదయాన్నే ఫోన్ చూస్తే ఇంత డేంజరా..? ఏం జ‌రుగుతుందంటే..!

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అందరి పనులు ఫోన్లతోనే. ఈ వాడకం మితిమీరితే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఉదయం పూట తమ ఫోన్ లో నోటిఫికేషన్లు, ఈ-మెయిల్లు , సోషల్ మీడియా అప్డేట్లతో వచ్చే సందేశాల వల్ల అనవసర ఒత్తిడికి గురవయ్యే అవకాశం ఉంది.

మీ మనసులో ప్రతికూలతలు పెరిగి రోజంతా ఆ ప్రభావం కనిపించవచ్చు. ఉదయాన్నే లేచింది మొదలు వివిధ సమాచారం కోసం వెతకటం, వాట్సాప్ లో మెసేజ్ లు ఎలాంటివి శోధిస్తూ ఉంటారు. ఈ ప్రభావం మానసిక స్థితిపైనా ప్రతికూలంగా ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అలాగే కంటి ఆరోగ్యము దెబ్బతింటుంది. మంచి ఆరోగ్యానికి చక్కటి నిద్ర అవసరం.

రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ చూస్తే నిద్ర కరువవుతుంది. మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూలైట్ మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తోంది. ఈ హార్మోన్ నిద్ర రావటంలో సహాయపడుతుంది. కాంతి ఎక్కువసేపు కంటిపై పడడం వల్ల నిద్రలేని సమస్య ఎదురవుతుంది.