ఏపీ పీపుల్ పల్స్: కన్ఫ్యూజ్ చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ప్రజా నాడి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారు? ఈ సారి అధికారంలోకి ఎవరు వస్తారు? అంటే చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు జగన్ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తారని అంటున్నారు. టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నవారు..తమదే అధికారమని అంటున్నారు. అటు జనసేన వాళ్ళు ఏమో తామే కింగ్ మేకర్స్..పవన్ సి‌ఎం అవుతారని చెబుతున్నారు.

ఇలా ఏ పార్టీ వర్షన్..ఆ పార్టీకి ఉంది. మరి ప్రజల వర్షన్ ఎలా ఉందంటే..అసలు ఊహకు అందడం లేదనే చెప్పాలి. వైసీపీకి ప్రజలు యాంటీగా ఉన్నారా? అంటే అది పూర్తిగా క్లారిటీ లేదు. పోనీ టి‌డి‌పికి సపోర్ట్ చేయాలని చూస్తున్నారా? అంటే అది తెలియడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఓటర్లు పార్టీల వారీగా విడిపోయారు.అందులో ఎలాంటి డౌట్ లేదు. వైసీపీ, టి‌డి‌పిలకు దాదాపు సమానమైన ఓటు బ్యాంకు ఉంది. ఇంకా వారు ఎలాంటి పరిస్తితుల్లోనైనా తమ పార్టీలకే ఓటు వేసుకుంటారు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇటు జనసేనకు కొంత ఓటు బ్యాంకు ఉంది. వారు పవన్ వైపు నిలబడతారు.

ఇలా మూడు ప్రధాన పార్టీల ఓటు బ్యాంకు దాదాపు 90 శాతం వరకు ఉండే ఛాన్స్ ఉంది. న్యూట్రల్ గా 10 శాతం మంది ఉండే ఛాన్స్ ఉంది. ఇక వారు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం, టి‌డి‌పికి 40 శాతం, జనసేనకు 7 శాతం..ఇతరులకు మిగిలిన ఓట్లు పడ్డాయి. వైసీపీకి ఎక్కువ ఓటింగ్ వచ్చింది. దీంతో న్యూట్రల్ వర్గాలు వైసీపీకే మద్ధతు ఇచ్చాయి.

మరి ఈ సారి వారు ఎటు మొగ్గు చూపితే వారిదే విజయం. ఇక వారి మద్ధతు ఎటు అనేది ఇప్పుడు అర్ధం కాకుండా ఉంది చూడాలి మరి ఈ సారి ప్రజలు ఎటువైపు ఉంటారో?