అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ..!!

బుల్లితెర యాంకర్ సుమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో షోస్ లతో తనదైన యాంకరింగ్ తో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పటికి నెంబర్ వన్ స్థాయిలో కొనసాగుతూ అటు బుల్లితెర టీవీ షోలు.. మరోవైపు వెండి తెర ఆడియో ఫంక్షన్లు, సినిమా రిలీజ్ ఫంక్షన్లతో పాటు సక్సెస్ మీట్ లు తో చాలా బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది సుమ.

తను కిలాయిడ్ టెండెన్స్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నానని.. ఈ చర్మ వ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించానని తెలిపింది. అంతేకాదు ఈ సమస్య వల్ల ప్రతిసారి మేకప్ వేసుకున్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందని.. తన కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి? ఎలా తీయాలి? వంటి విషయాలు కూడా తెలిసేవి కాదని.. అందుకే చర్మానికి ఈ డ్యామేజ్ జరిగిందని.

ఒకచోట గాయం అయితే అది పెద్దదిగా మారి చుట్టుపక్కలంతా వ్యాపించి మరింత పెద్ద గాయం అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుమ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు. అయితే ఈ వార్త‌ల‌లో నిజం ఎంతుందో సుమ గాని, ఆమె టీం గానీ అధికారికంగా స్పందిస్తేకాని తెలీదు.