పెళ్లికి సిద్ధమైన స్టార్ కిడ్.. ఫొటోస్ వైరల్..!

ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా పెళ్లిళ్లు సీజన్ నడుస్తోందని చెప్పాలి. ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా.. రాజస్థాన్లోని ప్రఖ్యాత ఉదయపూర్ ప్యాలెస్ లో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. మరొకవైపు పెళ్లికి సంబంధించిన పనులు కూడా షురూ అయినట్లు సమాచారం.

ఇక ఇదిలా ఉండగా మరొకవైపు తాజాగా బాలీవుడ్ లో ఇంకొక పెళ్లి వార్త వినిపిస్తోంది.. ప్రముఖ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. అంతేకాదు ఆమె వివాహం కూడా ఉదయపూర్ లోనే జరగబోతుందని సమాచారం. తాజాగా ఐరా ఖాన్ తన బాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరే ను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ జంట ఎంగేజ్మెంట్ వేడుక గత ఏడాది జరగగా.. ప్రస్తుతం ఈ జంట కూడా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరి పెళ్ళికి అన్ని పనులు కూడా ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

Aamir Khan's daughter Ira reveals that she was sexually abused at the age  of 14

 

ఇక బాలీవుడ్ తారల లాగే వీళ్లు కూడా ఉదయపూర్ లో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరి వివాహానికి రాబోయే అతిధుల జాబితా కూడా సిద్ధం అయిందట. అయితే ఎప్పుడు వివాహం జరగబోతోంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది వచ్చే నెలలో వివాహం జరుగుతుందని చెబుతుంటే… మరికొంతమంది వచ్చే ఏడాది వీరి వివాహం జరగబోతుందని అంటున్నారు. ఇకపోతే ఐరా ఖాన్.. అమీర్ ఖాన్ – రీనా దత్త ల ముద్దుల కూతురు అని అందరికీ తెలిసిందే. ఇక తల్లిదండ్రులు సెలబ్రిటీలు కావడంతో ఈమెకు మరింత పాపులారిటీ లభిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)