NC 23 మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఫిక్స్…. అతను ఎవరంటే….!!

అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో త్వరలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్‌ ఇటీవల వచ్చింది.

సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్న‌ ఈ సినిమా.. మత్స్యకారుల కథగా రూపొందుతుంది. ఇందులో నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచందర్‌ని తీసుకోవాలని భావించిన యూనిట్ కొన్ని కారణాల వలన అతడి స్థానంలో సంతోష్ నారాయణన్‌ని తీసుకోవాలని ఫిక్స్ అయిందట.
అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

మరోవైపు సంతోష్ నారాయణన్ ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి, వెంకటేష్ సైంధవ్ మూవీస్ కి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే నాగచైతన్య – సాయి పల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరీ మూవీ వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అదేవిధంగా సాయి పల్లవి తెలుగు సినిమాల్లో చాలా కాలం తర్వాత ప్రేక్షకులు పలకరించబోతుంది. దీంతో ఈ సినిమాతో ఎలా అయినా మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని నాగచైతన్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.