ఈ ముద్దుగుమ్మని గుర్తుపట్టారా.. ఈమె ఓ స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. ప్రతి ఏడాది పండగలు వచ్చినట్లు.. భాష, దేశంతో సంబంధం లేకుండా ఇక్కడకి వ‌చ్చి మరి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రేక్షకులని అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా అదే జాబితాలో ఉంది. అమెరికాలో పుట్టింది, పక్క రాష్ట్రంలో పెరిగింది. ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ అయిపోయింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ మరెవరో కాదు శ్రీ లీల.

ఇది టీనేజ్లో దిగిన ఫోటో. కాస్త పోలికలు తెలుస్తున్నప్పటికీ పాత ఫోటో కావడం వల్ల కొందరైతే గుర్తుపట్టలేకపోతున్నారు. అమెరికాలో తెలుగు కుటుంబంలో పుట్టిన శ్రీ లీల.. అక్కడే కొన్నాళ్లు పెరిగింది. అయితే పేరెంట్స్ విడాకులు తీసుకోవడంతో తల్లితోపాటు బెంగళూరు వచ్చేసింది. చిన్నప్పటినుండే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. టీనేజ్‌లోకి వచ్చేసరికి కన్నడలో హీరోయిన్ అయిపోయింది.

” పెళ్లి సందడి ” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. రెండో మూవీ ” ధమాకా ” సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇందులో ఆమె డాన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తుంది. మరోవైపు యంగ్ హీరోలతో కూడా నటిస్తుంది. దసరా నుంచి మొదలుపెడితే దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి.. ఇలా రాబోయే నాలుగైదు నెలల్లో తలో సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. వీటిలో కొన్ని హిట్ అయినా సరే హీరోయిన్గా ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.