చంద్రబాబు అరెస్ట్.. ఎన్టీఆర్ బామ్మర్ది ఏం చేశాడో చూడండి.. బావనే మించిపోయాడుగా..!

మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న మోస్ట్ ఫ్యాషనేట్ నిర్మాతల్లో యంగ్ అండ్ డైనమిక్ నిర్మాత నాగ వంశీ కూడా ఒకడు. మరి తన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్ లో అయితే ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు. అలాగే కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయడంలో ముందుండే ఈ నిర్మాణ సంస్థ నుంచి అలా రీసెంట్గా అనౌన్స్ అయినా ఓ క్రేజీ యూత్ ఫుల్ రైడ్ మూవీ ” మ్యాడ్ “.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నర్నె నవీన్ హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమాని అయితే మేకర్స్ ఈ సెప్టెంబర్ 28 కి రిలీజ్ చేస్తున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఈ సినిమా తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ap మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనిపై ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు అంటూ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది .

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బావమరిది సినిమాని వాయిదా వేయటంతో.. బావనే మించిపోయాడుగా ఈ సమయంలో తన సినిమా రిలీజ్ అయితే తనని కూడా ట్రోలింగ్ చేస్తారేమో అని భయపడి ఈ సినిమా వాయిదా వేశాడు.. ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఎన్టీఆర్ బయటకు వస్తే.. చంద్రబాబు కోసం బయటికి రాని ఎన్టీఆర్ తన బావమరిది కోసం తెగ హంగామా చేస్తున్నాడు అని అనుకుంటారేమో అని ఇలా చేసాడు.. ఈ సినిమాని మేకర్స్ కూడా అందుకె వాయిదా వేశారు అంటూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు కారణం తెలియాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే.