బిగ్ బాస్ లో బోల్ట్ బోల్ట్ బ్యూటీ షకీలా కు ఊహించని పరిణామం.. వార్నింగ్ మామూలుగా లేదుగా..!

నాగార్జున హోస్ట్ గా చేస్తున్నా బిగ్ బాస్-7కు రెండో రోజు “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హీరో నవీన్ పోలిశెట్టి గెస్ట్ గా వచ్చి హౌస్ లోని కంటెస్టెంట్స్ తో సందడి చేశాడు. డార్క్ రూమ్ లోకి ప్రవేశించిన నవీన్ కాసేపు కంటెస్టెంట్స్‌ను ఆటపట్టించాడు. శోభా శెట్టి నేను శెట్టి అంటూ పోలిశెట్టితో పరిచయం చేసుకుంది. దీంతో నవీన్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.

వెంటనే ఈ హీరో కంటెస్టెంట్స్ తో దగ్గరుండి ఫన్నీ టాస్క్ పెట్టాడు. లేడీ ల‌క్ అంటూ తమకు ఇష్టమైన లేడీ కంటెస్టెంట్స్‌కు జెంట్స్ తో బ్యాండ్స్ కట్టించాడు. ర‌తిక‌కు బ్యాండ్ కడుతూ… పల్లవి ప్రశాంత్ తెగ సిగ్గుపడ్డాడు. అలాగే హీరో శివాజీ నాగార్జున ఇచ్చిన రూ. 35 లక్షల ఆఫర్ గురించి గుర్తు చేసుకుంటూ లోపల బాధ ఉన్న కూడా బయటకు సరదాగా అన్నాడు.

ఇక టేస్టీ తేజ బోల్ట్ బ్యూటీ షకీలాను…”మీరు ఛాన్స్ లు లేక అడల్ట్ సినిమాలు చేశారా? లేదా ఇష్టంతోనే అలాంటి సినిమాలు చేశారా? ఆ రోల్స్ లో నటిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించేది? మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమీ అనలేదా? అని బోల్డ్ ప్రశ్నలు అడిగాడు. దీంతో షకీలా.. ఏంట్రా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా? అంటూ వార్నింగ్ ఇచ్చింది. నాకు ఇలాంటి సినిమాలు వచ్చాయి కాబట్టి చేశాను. గ్లామర్ సాంగ్స్ చేస్తే లేని తప్పు గ్లామర్ రోల్స్ చేస్తే తప్పేంటి రా? మనీ వస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఏమి అనలేదు అంటూ షకీలా చెప్పుకొచ్చింది.