`చంద్రముఖి 2`తో సాయి ప‌ల్ల‌వికి ఉన్న సంబంధం ఏంటి.. ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ లీక్‌!

2005లో విడుదలైన ర‌జ‌నీకాంత్ సూప‌ర్ హిట్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా ఇప్పుడు `చంద్ర‌ముఖి 2` రాబోతున్న సంగ‌తి తెలిసిందే. పి. వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్ హీరోగా న‌టించాడు. టైటిల్ పాత్ర‌ను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ పోషించింది. అలాగే వడివేలు, లక్ష్మీ మీనన్‌, మహిమా నంబియార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్న‌ర్ కీర‌వాణి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. సెప్టెంబ‌ర్ 15న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ప్ర‌మోష‌న్స్ తో చిత్ర టీమ్ మ‌రింత హైప్ పెంచుతుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ లీక్ అయింది.

చంద్ర‌ముఖి 2తో న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వికి సంబంధం ఉంద‌ట‌. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ మూవీలో టైటిల్ రోల్ కోసం మొట్ట‌మొద‌ట సాయి ప‌ల్ల‌వినే సంప్ర‌దించార‌ట‌. సాయి ప‌ల్ల‌వి అద్భుత‌మైన డ్యాన్స‌ర్. పైగా క‌ళ్ల‌తోనే న‌టించ‌గ‌ల అతి కొద్ది మందిలో సాయి ప‌ల్ల‌వి ఒక‌టి. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌ముఖి పాత్ర‌కు ఆమె ప‌ర్ఫెక్ట్ గా సూట్ అవుతుంద‌ని మేక‌ర్స్ భావించార‌ట‌. సాయి ప‌ల్ల‌వితో సంప్ర‌దింపులు కూడా జ‌రిపారు. కానీ, ఆమె ఏవో కార‌ణాల వ‌ల్ల ఈ మూవీని రిజెక్ట్ చేసింది. దాంతో సాయి ప‌ల్ల‌వికి బ‌దులుగా కంగ‌నా ర‌నౌత్ ను ఎంపిక చేశారు. ఏదేమైనా సాయి ప‌ల్ల‌వి చంద్ర‌ముఖి 2 చేసుకుంటే.. సినిమా మీద హైప్ పీక్స్ లో ఉండేద‌న‌డంలో సందేహం లేదు.