పవన్ కళ్యాణ్ ముఖంపై కార్ కీస్ విసిరేసిన అమితా బచ్చన్.. కారణం ఇదే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా అభిమానుల సంఖ్య మాత్రం పెరుగుతుంది తప్ప తరగదు. పవన్‌ను ప్రేక్షకులు అభిమానిస్తారు అనడం కంటే పిచ్చిగా ప్రేమిస్తారు అనడంలో సందేహం లేదు. అలాగే కామన్‌ పీపుల్స్ మాత్రమే కాకుండా ఆయనను స్టార్ హీరోలు కూడా ఇష్టపడుతుంటారు. తాజాగా.. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంత పెద్ద స్టార్ హీరో మొఖం మీద బాలీవుడ్ హీరో కార్ కీస్ విసిరి కొట్టాడట. అయితే ఇది నిజ జీవితంలో కాదు. అమితా బచ్చన్, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాను ఓసారి తన ఇంట్లో మినీ థియేటర్లో తన భర్తతో కలిసి చూశాడట. అమిత బచ్చన్ దంపతులు ఇద్దరు మొదటి నుంచి ఎంతో ఎంజాయ్ చేస్తూ చూశారట. సడన్గా క్లైమాక్స్ సీన్లులో హీరోను హీరోయిన్ వదిలి వెళ్ళిపోతుంటే.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ మీద ఉన్న లవ్ ను ఎక్స్ప్రెస్ చేయకుండా.. తనలోనే తాను దాచుకుని సెండాఫ్ ఇస్తాడు.

ఇలా హీరోయిన్ బాయ్ చెప్పి వెళ్ళిపోగానే ఏం సినిమా రా ఇది ఎవడ్రా బాబు ఈ సినిమా తీసింది అని కోపంతో అమితా బచ్చన్ స్క్రీన్ మీద.. పవన్ ఇమేస్‌ వచ్చినప్పుడు ముఖంపై కార్ కీస్ విసిరి కొట్టాడట. కానీ ఆ తర్వాత సడన్గా హీరోయిన్ మళ్లీ వెనక్కి తిరిగివచ్చి పవన్ కళ్యాణ్ నుదుటి మీద కిస్ పెట్టి ఐ లవ్ యూ చెప్పగానే అమితా బచ్చన్.. జయ బచ్చన్ ఇద్దరు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారట.