అదరగొడుతున్న 7/G బృందావన్ కాలనీ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్.. స్టార్ హీరో మూవీ రేంజ్ లో..

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి భారీ విజయాలను అందుకున్న సినిమాలన్నీ నేటి టెక్నాలజీకి తగ్గట్టుగా 4k క్వాలిటీతో మార్చి డాల్బీ అట్మాస్ సౌండ్ తో ప్రేక్షకుల అభిమాన థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలకు ఆడియన్స్, ఫాన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఖుషి, జల్సా, తొలిప్రేమ, పోకిరి, బిజినెస్‌మ్యాన్ లాంటి ఎన్నో సినిమాలు ఇప్పటికే కొత్త రికార్డులను సృష్టించాయి.

కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా చిన్న చిన్న హీరోల సినిమాలు కూడా అద్భుతమైన ఆదరణ పొందుతున్నాయి. ఈ నగరానికి ఏమైంది అనే చిన్న సినిమా రిలీజై కలెక్షన్స్ పరంగా ఆల్ టైం హిట్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు 7/G బృందావన్ కాలనీ సినిమాని రీ మాస్టర్ చేసి ఈ నెల 22న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రాంతాల్లో రెండు రోజుల క్రితమే రిలీజ్ అయ్యాయి. రెస్పాన్స్ అదిరిపోయింది అని చెప్పాలి.

ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే ఈ సినిమాకి టికెట్స్ ప్రారంభించిన ప్రతి చోట హార్డ్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. స్టార్ హీరోల రీ రియల్ సినిమాలకు కూడా ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కాలేదనడంలో సందేహం లేదు. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు కోటి రూపాయలు పైగాని గ్రాస్ వసూలు వచ్చే అవకాశం ఉందట. ఇక అప్పట్లో యూత్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్‌ ఉంది. ఇందులో పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక రీ రిలీజ్‌లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.