యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 సినిమాకు బెదురులంక 2012 మూవీకి ఉన్న కామన్ పాయింట్ ఏమిటో తెలుసా..!

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ ఫాలోయింగ్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కార్తికేయ తాజాగా బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టి, కార్తికేయకు జంటగా నటిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా టైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదగా రిలీజ్ చేశారు.

రీసెంట్గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. క్లాక్స్ అనే దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకులు ముందుగా రాబోతున్న నేపథ్యంలో కార్తికేయ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఇక అందులో ఆయన పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. తన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 మూవీకి బెదురు లంక సినిమాకు ఉన్న కామన్ పాయింట్ గురించి చెప్పాడు.

ఈ రెండు సినిమాలు గోదావరి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి. అలాగే రెండు సినిమాలను కార్తికేయ పేరు శివ.. అయితే ఇది సెంటిమెంట్ అని అనుకోవచ్చా అని అడిగిన ప్రశ్నకు ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పుకొచ్చాడు. “ఆర్ఎక్స్ 100” సినిమాలో హీరో పేరు గుర్తుకు రాలేదని, కానీ బెదురు లంక సినిమా హీరో క్యారెక్టరైజేషన్ కు శివ అన్న పేరు వచ్చిందని చెప్పడంతో అదే పేరును ఉంచినట్లు కార్తికుయ‌ దర్శకులు తెలిపారు. ఈ సినిమా విడుదల అయ్యాక ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో వేచి చూడాలి.