“అందరు మంచోడు అనుకుంటున్న మీ బన్నీ రియల్ క్యారెక్టర్ అదే..”.. అల్లు అర్జున్ పై తెలుగు హీరో సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ పేరే మారు మ్రోగి పోతుంది . అల్లు అర్జున్ పేరు ఇండస్ట్రీలో ఎక్కువ స్థాయిలో ట్రెండ్ అయ్యేది. కానీ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా అల్లు అర్జున్ పేరు ట్రెండ్ అవుతుంది. దానికి కారణం రీసెంట్ గానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ జాతీయ అవార్డుల ప్రకటన ఉత్సవంలో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించడమే .

పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ ఈ ఘనతను దక్కించుకున్నాడు . కాగ గత 69 ఏళ్లగా తెలుగు జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా వెయిట్ చేసిన కలను అల్లు అర్జున్ ఫుల్ ఫిల్ చేసాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్కి సంబంధించిన ఏ వార్త అయినా సరే గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా అల్లు అర్జున్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేశారు అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్ . ఆయన కూడా ఇండస్ట్రీలో హీరోనే కాకపోతే స్టార్ గా మారలేకపోయాడు . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు శిరీష్ – అల్లు అర్జున్ పై ఇలా మాట్లాడాడు .

ఆయన మాట్లాడుతూ ..”అల్లు అర్జున్ చాలా పెద్ద స్టార్ హీరో ..కానీ ఇప్పటికి ఆయన వస్తువులు దొంగతనం చేస్తూ ఉంటాడు. నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న షర్ట్స్ జాకెట్స్ నాకు తెలియకుండా ఆయన తనకి సంబంధించిన ఈవెంట్స్ కు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు . ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయితే కానీ ఆయన నా బట్టలు వేసుకున్నాడు అన్న విషయం నాకు తెలియదు. అంతేకాదు నేను అదే షర్ట్ ను ఎప్పుడైనా వేరే ఫంక్షన్ కి వేసుకెళ్తే ఇది బన్ని వేసుకున్న షర్ట్ కదా అంటూ నన్నే ఏడిపిస్తారు. ఇది నా షర్ట్ రా బాబు అని చెప్పడానికి నేను చాలా తండాలు పడాల్సి వస్తుంది. ఇప్పటికీ అల్లు అర్జున్ నేను ఎంతో ఇష్టంగా దాచుకున్న షర్ట్స్ బ్లేజర్స్ నాకు తెలియకుండా నా బీరువా నుంచి తీసేసుకుంటాడు . ఆ విషయంలో మా అన్న సూపర్ ఎక్స్పర్ట్” అంటూ ఫన్నీ గానే కామెంట్స్ చేశారు . దీంతో సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!