యూఎస్‌లో ‘ స‌లార్ ‘ సెన్షేష‌న‌ల్ … 4 వారాల ముందే దుమ్ము రేపే రికార్డ్‌..!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వ‌రుస‌ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న సలార్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా యూఎస్ లో భారీ హైప్‌ను సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా బుకింగ్స్ ని స్టార్ట్ చేసుకోగా ఏ ఇండియన్ సినిమా కూడా అందుకోలేని భారీ స్పందన ఈ సినిమాకు వచ్చింది. ఇక ఈ సినిమా ఇంకా నెల రోజుల ముందే రికార్డు గ్రాస్ ని ప్రీమియర్ తో సెట్ చేస్తుండగా లేటెస్ట్‌గా ఈ సినిమా హాఫ్ మిలియన్ వ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.

ఇంకా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4 వారాలు ఉన్నా కూడా అదే రేంజ్‌లో సెన్సేషన్ సెట్ చేయడం ప్రభాసం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లోనే జరిగింది. ఇక ఈ సినిమాకి రవి బసృర్‌ సంగీతం అందించారు. హొంబాళే ఫిలిమ్స్‌ బ్యానర్ పై ఈ సినిమా రూపొందించబడింది.