రామ్- బోయపాటి ‘ స్కంద ‘ ఫ‌స్ట్‌ రివ్యూ.. చివరి 20 నిమిషాలు ఊచకోత కోసిప‌డేశాడుగా…!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ తర్వాత దివారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ప్లాప్‌ అందుకున్నాడు.. ఈ సినిమా తర్వాత అఖండ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తో స్కందా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. బోయపాటి తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్, టైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అదే విధంగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మరియు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా స్టార్ హీరో సినిమాకి ఏ రేంజ్ లో తగ్గకుండా అదే రేంజ్ లో జరుగుతుంది. ఈ స్థాయిలో ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చిందంటే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు మరియు ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ సినిమాలను రొటీన్ గా ఫీల్ అయ్యే ప్రేక్షకులకు మాత్రం ఇవి నచ్చలేదు.. కానీ మాస్ ఆడియన్స్ కి మాత్రం తెగ నచ్చేసింది.

ఇదే సమయంలో ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూ షో గా వేశారు. కొంతమంది మీడియా మిత్రులు మరియు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ షోని చూశారు. ఈ సినిమా చూసిన వారి దగ్గర నుంచి వచ్చిన టాక్ ఏమిటంటే.. ఈ సినిమా కూడా గత బోయపాటి శ్రీనివాస్ సినిమాల కంటే కొత్తగా ఉంది అని, ప్రధానంగా యాక్షన్ సినిమాలు ఇదివరకు ఎవరూ చూడని విధంగా ఉన్నాయని, చివరి 20 నిమిషాలు మాత్రం రక్తపాతం మామూల రేంజ్ లో లేదంటూ టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో శ్రీలీలా మరియు రామ్ కలిసి వేసిన డాన్స్ థియేటర్లో ప్రేక్ష‌కుల చేత డాన్స్ వేయించేలా అదిరిపోయేలా ఉన్నాయని అంటున్నారు. కేవలం ఆ పాటల కోసమే టికెట్స్ కొనేయచ్చు అని, రీసెంట్ గా విడుదల అవ్వబొయ్యే సినిమాలలో ది బెస్ట్ గా ఈ చిత్రం నిలబడబోతుందని అంటున్నారు, ఇక మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయం అందుకుంటాడు చూడాలంటే సెప్టెంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే.