అనుష్క ‘ మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి ‘ సినిమా టాక్ వ‌చ్చేసింది..

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కలిసి నటించిన మూవీ మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి. డైరెక్టర్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వివరిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు ఏ/యు సర్టిఫికెట్ ఇచ్చారని వెల్లడించారు. థ‌మన్ సంగీతం అందించిన ఈ సినిమాలో జయసుధ, కేశవ దీపక్, అభినవ్ గౌతం తదితరులు కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం అనుష్క అభిమానులు ఎదురుచూస్తున్నారు. అనుష్క గ‌త‌ కొంతకాలంగా స్క్రీన్ పై కనిపించలేదు. దీంతో చాలా గ్యాప్ తర్వాత అనుష్క కనిపిస్తున్న మొదటి సినిమా కావడం.. నవీన్ పోలిశెట్టి హీరో కావ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాతో అనుష్క ఎలాగైనా హిట్ కొట్టాలని అభిమానులు భావిస్తున్నారు.