రామ్ తో శ్రీ‌లీల‌కు `స్కంద‌` మూడో సినిమానా.. యంగ్ బ్యూటీ ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంట్రా బాబు?

ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స్కంద‌`. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించగా బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెష‌ల్ సాంగ్ లో మెరిసింది.

సెప్టెంబ‌ర్ 15న ఈ చిత్రం తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ఊపందుకున్నాయి. శనివారం సాయంత్రం స్కంద ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. స్పెష‌ల్ గెస్ట్ గా బాల‌య్య వ‌చ్చి సంద‌డి చేశారు. సినిమాపై మ‌రింత హైప్ ఇచ్చాడు. అయితే ఈ ఈవెంట్ లో శ్రీ‌లీల మాట్లాడుతూ ఓ సీక్రెట్ ను రివీల్ చేసింది.

ఇంత‌వ‌ర‌కు రామ్‌, శ్రీ‌లీల జంట‌గా తొలి సినిమా స్కంద అనే అంద‌రూ అనుకున్నారు. కానీ, శ్రీ‌లీల మాత్రం ట్విస్ట్ ఇచ్చింది. రామ్ తో స్కంద త‌న‌కు మూడో సినిమా అంటూ పేర్కొంది. ఇంత‌కు ముందు రామ్ హీరోగా తెర‌కెక్కిన రెండు సినిమాల్లో శ్రీ‌లీల‌కు అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. అయితే ఏవో కార‌ణాల వ‌ల్ల వాటిలో న‌టించ‌లేక‌పోయింది. ఇక మూడో అవకాశంలో మా ఇద్ద‌రి కాంబో సెట్ అయ్యిందని, మూడు నా లక్కీ నెంబర్.. అందుకే వర్కవుట్ అయ్యిందేమో అంటూ శ్రీ‌లీల చెప్పుకొచ్చింది. ఇక తాను వ‌దులుకున్న రామ్ సినిమాలేవో మాత్రం శ్రీ‌లీల చెప్ప‌లేదు.