అల్లు అర్జున్‌కి ఉపాసన అదిరిపోయే గిఫ్ట్.. టచ్ చేసారంటూ బ‌న్ని ఎమేష‌న‌ల్‌..

ఇటీవల అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్‌కు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ తమ అభినందనలు తెలియజేశారు. ఇందులో భాగంగా బావ అని ఆప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ – బన్నీకి అభినంద‌న‌లు తెలియజేశాడు. అలాగే త్రిబుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి.. పుష్ప తగ్గేదేలే అంటూ సినిమా స్టైల్‌లో అభినందించాడు. ఇలా మెగా హీరోస్ కూడా చాలామంది అల్లు అర్జున్‌ను అభినందించగా.. రామ్‌చరణ్ మాత్రం ఒక రోజు ఆలస్యంగా విషెస్ చెప్పాడు.

అందుకు బన్నీ కూడా సింగిల్ వర్డ్ లో థాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్యన ఏమైందంటే పలువురు నెటిజ‌న్స్‌ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతు అల్లు అర్జున్‌కి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు స్పెషల్గా ఓ ఫ్ల‌వ‌ర్ బుకె గిఫ్ట్‌ చేశారు. దీంతోపాటు స్పెషల్ లైన్ని ట్యాగ్‌ చేశారు.

డియర్ బన్నీ కంగ్రాట్స్.. నిను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ఇలా ఇంకెన్నో అవార్డ్స్ నిన్ను వరిస్తాయి.. అందుకు నీవు అర్హుడివి కూడా అంటూ ఉపాసన రాసుకొచ్చారు. దీంతో అల్లు అర్జున్ కూడా కొంతమేరకు ఎమోషనలై థాంక్యూ సో మచ్.. టచ్ చేసారు అంటూ రాసుకోచ్చాడు. ఇదంతా తన ఇన్‌స్టా స్టోరీలో అల్లు అర్జున్ షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో రామ్ చరణ్ బన్నీ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని.. ఇకపై రూమర్స్ ను ఆపేయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.