ఖుషి క్లైమాక్స్ ఏంటో తెలిసిపోయింది.. సమంత, విజయ్ ఏడిపించేస్తారట..

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా పరిచయమైన కొత్తలో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న విజయ్ ఈ మధ్య కాలంలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే   ‘ఖుషి’ అనే ఒక మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న సినిమా ‘ఖుషి’. ఈ సినిమా లో విజయ్ సరసన సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎన్నో అవాంతరాల నడుమ ఇటీవలే కంప్లీట్ అయింది. దీంతో చిత్ర యూనిట్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతోంది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా షురూ చేసింది. ‘ఖుషి’ మూవీ నుంచి వచ్చిన మొత్తం అప్‌డేట్లకు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా లోని పాటలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నారు చిత్ర బృందం. సినీ ఇండస్ట్రీ లో వస్తున్న సమాచారం ప్రకారం ‘ఖుషి’ మూవీలో క్లైమాక్స్ సీన్ హైలైట్‌గా ఉండబోతుందట.

ముఖ్యంగా ఇందులో విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు మధ్య వచ్చే ఘర్షణపూరిత సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీరు తెప్పించే విధంగా డిజైన్ చేశారని సమాచారం . చాలా సరదాగా మొదలైన ఈ సినిమా ఎమోషనల్ గా ముగుస్తుందట. ఈ సినిమా చూసిన వాళ్లంతా బరువైన గుండెతో బయటకు వస్తారనే టాక్ వినిపిస్తోంది. ఖుషి’ మూవీ హీరో, హీరోయిన్లు ప్రేమలో పడడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం,  అనంతరం వాళ్ల మధ్య మనస్పర్థలు రావడం అనే అంశాలతో రూపొందిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో సమంత, విజయ్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ పాయింట్ లీక్ అయింది.