పొలిటికల్ “గేమ్ ఛేంజర్”గా పవన్.. “ప్రేమ వాలంటీర్” తో “పవర్” మారుతుందా…?

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హిట్ పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు అసలు మాకు ఈ రాజకీయాల గోల వద్దు అనుకున్న వాళ్లు కూడా 2024 లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు సీఎం పదవిని చేపడతారు అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని స్టార్ అంటూ పొగిడేసిన పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు ఆయనపై బూతులు వర్షం కురిపిస్తున్నారు .అయితే అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తున్న పవన్ ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇష్యూలో ఇరుక్కున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీ వాలంటీర్స్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే . వాలంటీర్లు ఒంటరి మహిళల సమాచారం సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్ కి సహకరిస్తున్నారు అని కొందరు వాలంటీర్స్ చాలా ప్రమాదకరం అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై ఏపీ గవర్నమెంట్ కూడా తీవ్రంగా మండిపడుతుంది . ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన నిందలు ప్రూవ్ చేసుకోకపోతే ఆయనపై క్రిమినల్ చర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది .

ఇలాంటి క్రమంలోనే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కీలకంగా మారిన వాలంటీర్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో జబర్దస్త్ కమెడియన్ సడన్గా “ప్రేమ వాలంటీర్” అంటూ ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తూ ఉండడం సంచలనంగా మారింది . జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఇమ్మానుయేల్ రీసెంట్గా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నామని అఫీషియల్ గా చెప్పుకొచ్చారు . అయితే దీని వెనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు ఉన్నాడు అంటున్నారు పలువురు రాజకీయ నేతలు . అంతేకాదు దీని ద్వారానే ఏపీలో వాలంటీర్స్ ఎలా ఉన్నారు అనే విషయం అభిమానులకి చేరవేసేలా .. రాబోయే ఎలక్షన్స్ లో జనసేనకు ప్లస్ అయ్యేలా కొన్ని సీన్స్ తెరకెక్కించబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది .

అయితే ఈ “ప్రేమ వాలంటీర్” వెనక నాగబాబు ఉన్నాడో.. లేదో ..? తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఫేట్ మార్చే సిరీస్ గా ఈ “ప్రేమ వాలంటీర్ ” మిగిలిపోతుంది అంటున్నారు కొందరు సామాన్య జనాలు . అంతేకాదు ఒకవేళ నిజంగా వాలంటీర్లు అలా చేసి ఉంటే కచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కు ఈ వెబ్ సిరీస్ ఎంతో హెల్ప్ చేస్తుందని.. ఒకవేళ ఇదంతా పొలిటికల్ గేమ్ పరంగా ఆడుతున్న ఓ డ్రామా అయితే మాత్రం 2024 లోనే కాదు ..ఆ తర్వాత జరగబోయే ఎన్నికల్లోను పవన్ కళ్యాణ్ “పవర్” చేపట్టే ఛాన్సే ఉండదని చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి ఈ “ప్రేమ వాలంటీర్” సిరీస్ పవన్ కళ్యాణ్ కు “పవర్” తెస్తుందో..? “పవర్” తీసేస్తుందో..?