పవన్ కళ్యాణ్‌కి ఇన్విటేషన్ పంపిన చిరంజీవి.. విషయం ఏంటంటే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’  సినిమా భారీ అంచనాల నడుమ వచ్చే వారం విడుదల కాభోతుంది అనే విషయం అందరికి తెలిసిందే. మొహార్ రమేష్ దర్శకత్వం వహించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన తమన హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే వారం విడుదల అవుతున్న సందర్బంగా ఈ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు మూవీ టీమ్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమళ్ళు సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉన్నాడట.

దాంతో భోళా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని పిలినట్లు తెలుస్తుంది. పవన్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవ్వడానికి ఓకే చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి మొహార్ రమేష్ కి మధ్య మంచి సానిహిత్యం ఉంది. అందుకే పవన్ ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నాడు అని సమాచారం. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు, మొహార్ రమేష్ కూడా మంచి స్నేహితులు. కాబట్టి ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు హాజరవుతారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.


పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లో ఎవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైనప్పటికి కూడా మెగా ఫ్యాన్స్ హ్యాపీగానే ఫీల్ అవుతారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి వస్తే చాలా బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ‘బ్రో ‘ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసాడు. ఆ సినిమా వివాదం అవుతున్న కారణం గా ఇప్పుడు పవన్ భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇదిలా ఉండగా భోళా శంకర్ సినిమా మంచి విజయం సాధించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.