బన్నీ పుష్ప సినిమాను మహేష్ వదులుకొని తప్పు చేశాడా..? వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సుకుమార్, అల్లుఅర్జున్, పుష్ప సినిమా పేర్లు మారుమోకపోతున్నాయి. 69వ నేషనల్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇక దాంతో అభిమానులు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరికొందరు ఈ సినిమాని వదిలేసుకున్న హీరో గురించి మాట్లాడుకుంటున్నారు.. అవును పుష్ప కథను ముందుగా సుకుమార్ మహేష్ కు చెప్పాడు.. మహేష్ సినిమాకు నో చెప్పడంతో పుష్ప అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది. ఇదే విషయాన్ని మహేష్ తాజాగా తన అభిమానులతో పంచుకున్నాడు.. కొన్ని కారణాల వల్ల సుకుమార్‌తో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ చేసుకున్నానని, మళ్లీ మంచి కథ దొరికితే మాత్రం మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అప్పటికే వీరిద్దరి కాంబోలో 1న్ నేనొక్కడినే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

అదే సమయంలో మహేష్ పుష్ప సినిమాను కాదనడానికి ఒక కారణం కూడా ఉందట. మొదటినుంచి మహేష్ తన బాడీ లాంగ్వేజకు సూటయ్యే సినిమాలను ఎంచుకుంటూటూ వచ్చాడు. పుష్పలో ఉన్న డెప్త్ ను తాను చేయలేని అందుకే ఆ సినిమా వదిలేస్తున్నానని సుకుమార్‌తో చెప్పాడట. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటించక ఆ పాత్రలో అతను తప్ప మరొక హీరో ఎవరు నటించలేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ రావటంతో మహేష్ ఈ సినిమాను వదిలేసి తప్పు చేశాడా..? అని మరికొందరు అంటున్నారు. కానీ మహేష్ కు ఇలాంటి పాత్రలు సెట్ అవ్వని ఆయనకు తెలుసు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడని బన్నీ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కనపడితే ఎవరికి రాసిపెట్టి ఉన్న సినిమా వారికే వెళుతుంది. ఇక్కడ నో డిస్కషన్ పుష్ప అంటే బన్నీని అవసరం లేదు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.