మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా బ్లడ్ బ్యాంక్ పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. దీనిపైన హీరో రాజశేఖర్ జీవిత 2011లో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై అప్పట్లో నిర్మాత అల్లు అరవింద్ చాలా ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారిపైన కోర్టులో పరువు నష్ట ధావ కూడా వేయడం జరిగింది అల్లు అరవింద్.. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత ఈ కేసులో తుది తీర్పు రావడం జరిగింది. జీవిత ,రాజశేఖర్ కు ఏడాది పాటు జైలు శిక్షతోపాటు ఐదు వేల జరిమానా కూడా విధించడం జరిగింది.
అయితే ఇప్పటివరకు ఈ విషయం పైన మెగా కుటుంబం ఎవరు కూడా స్పందించలేదు.. ఈ కేసు వేసిన అల్లు అరవింద్ కూడా మీడియా ముందర ఎక్కడ ఈ విషయం పైన మాట్లాడలేదు.. తాజాగా భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక పైన అల్లు అరవింద్ ఈ కేసు గురించి మాట్లాడారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ నేను ఇక్కడికి వచ్చింది సినిమా సక్సెస్ కావాలని చెప్పడానికి కాదు.. ఆయన కెరియర్లో చూడని బ్లాక్ బస్టర్స్ లేవు ఆయన చూడని కలెక్షన్స్ లేవు ఆయన సినిమాలు చూస్తూ మీరు అభిమానులు అయి ఉంటారు..
కానీ నేను మాత్రం ఆయనతో సినిమాలలో చేస్తూ అభిమానిగా మారానని తెలిపారు.. ఆ అభిమానం ఎలాంటిది అంటే ఆయనపై తప్పుడు మాటలు మాట్లాడినందుకు వాళ్లకి జైలు పంపించేందుకు 12 ఏళ్ల పాటు పోరాడాను అది నా అభిమానం అంటూ తెలిపారు అల్లు అరవింద్. అలాగే డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ.. తనని నేను చిన్నప్పటినుంచి చూస్తున్నాను చిరంజీవి అంటే తనకు చాలా అభిమానం ఆ ప్రేమతోనే ఈ సినిమాను చేశారు అతడి కోసమే ఇక్కడికి వచ్చాను అతను సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.