ఆ త‌ల్లి, కూతురు ఇద్ద‌రూ ఎన్టీఆర్‌తో జోడీ క‌ట్టారే… ఎవ‌రా హీరోయిన్లు…!

ఇటీవల కాలంలో చాలామంది స్టార్ హీరోయిన్స్ తండ్రి కొడుకులు ఇద్దరితో కలిసి నటించడం కామన్ అయిపోయింది. అలా తండ్రి కొడుకులతో కలిసి హీరోయిన్‌గా నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కాజల్ – చిరంజీవితో కలిసి ఖైదీ నెంబర్ 150 లో కనిపించింది. రామ్ చరణ్ తో మగధీర సినిమాలో కూడా మెప్పించింది. అలానే తమన్నా రామ్ చరణ్‌, చిరంజీవితో ఇద్దరితో కలిసి నటించింది. ఇక‌ అప్పట్లోను ఓ తల్లి, కూతురు సీనియర్ ఎన్టీఆర్ తో నటించడం విశేషం. ఇంతకీ ఎవరా తల్లి కూతుళ్ళు ఒకసారి చూద్దాం.

ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోయిన్ దేవిక ఎన్నో హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేవిక దాదాపు తెలుగులో ఎన్టీఆర్ తో, కత్తి కాంతారావ్‌తో మాత్రమే ఎక్కువ‌గా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక‌ తెలుగులోనే కాక తమిళ్ లోను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కూతురు కనక కూడా సినిమాల్లోకి వచ్చింది. కనక తెలుగులో కేవలం రెండు సినిమాల్లో నటించ‌గా మొదటి సినిమా ఎన్టీఆర్‌తో కలిసి నటించడం విశేషం. ఎన్టీఆర్‌తో ఆమె బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర సినిమాలో న‌టించింది.

 

మరో సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన క‌నిపించింది. త‌ర్వాత త‌మిళ , మ‌ళ‌యాళ సినిమాల్లో నటించింది. కానీ కెరీర్లో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాలేదు. దీనికి కారణం కనుక తల్లి దేవిక‌నే అట. దేవికకి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది బాగా తెలుసు సినీ ఇండస్ట్రీలో దేవిక ఎవరిని నమ్మేవారు కాదట. చాలా జాగ్రత్తగా ఉండే వారిని.. అందుకే కూతుర్ని కూడా ఎక్కువగా ఇండస్ట్రీలో వారితో కలవనిచ్చేవారు కాదని.. భద్రత భావం ఎక్కువగా ఉండేదని తెలుస్తుంది.

ఎవరైనా నమ్మించి మోసం చేస్తారేమో అనే ఉద్దేశంతో సినిమా వారిని ఎక్కువగా ఇంటికి రానిచ్చేది కాదట. ఎవరైనా ఇంటికి రావాలంటే ముందుగా ఫోన్ చేసి రావాలని కండిషన్ కూడా పెట్టేద‌ట‌. అలాగే కనకకు మేకప్ చేసే వ్యక్తులను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉండేదట. కూతురు ఎక్కడికి వెళ్లినా దేవిక కూడా వెళ్లడం సినిమా హీరోలతో కనుకని ఎక్కువగా మాట్లాడనివ్వకపోవడం.. కూతురు దగ్గరకు ఎవరిని రానివ్వకపోవడంతో కన‌క‌ కెరీర్‌లో ముందుకు వెళ్లలేకపోయిందని తెలుస్తుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో మనస్థాపానికి గురైన కనక ఇంటి నుంచి వెళ్లిపోయింది.