చిన్నప్పుడు చిరంజీవి కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుపడితే మీరు జీనియస్..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీస్ గా కొనసాగుతున్న ఎంతోమంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీదేవి నుంచి ఈ తరం కీర్తి సురేష్ వరకు అందరూ చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పై ఫోటోలో కనిపించే ఈ అమ్మాయి మెగాస్టార్ చిరంజీవికి కూతురుగా నటించింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడేమో హీరోయిన్లకే పోటీ ఇచ్చేంత అందంగా మారింది.

ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. చిరంజీవి – సిమ్రాన్ జంట‌గా తండ్రి కూతురు మధ్య ఉండే అనుబంధం స్టోరీతో వచ్చిన డాడీ సినిమాలో.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనుష్క మల్హోత్ర. ఈమె నటించిన ప్రతి సన్నివేశం అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. సిమ్రాన్ కంటే ఈ సినిమాలో ఆ పాపకి ఎక్కువగా గుర్తింపు వచ్చింది. అనుష్క మల్హోత్రా డాడీ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చిన నటించడానికి ఆసక్తి చూపలేదు. ముంబైలో పుట్టి పెరిగిన అనూష ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని బర్నింగ్‌హామ్‌లో ఫ్యామిలీతో కలిసి ఉంటుంది.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం మార్కెటింగ్ స్టేటజిస్ జాబ్ చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లోను అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోస్, ఫొటోస్ షేర్ చేసుకుంటూ తన టాలెంట్‌ని బయటపెడుతుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు వస్తున్న‌ నటనపై ఆసక్తి చూపడం లేదట. ప్రస్తుతం హీరోయిన్లకు పోటీ వ‌చ్చేలా మంచి అందంగా తయారైన ఈమె ముక్కుపుడకతో మరింత అందాన్ని పెంచుకుంది. ప్రస్తుతం ఈమె ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Anushka Malhotra (@anush.malhotra)