బాలకృష్ణ ఫ్యాన్స్ కి పండగే.. కిక్కిచ్చే అప్‌డేట్..

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో నటిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భగవంత్ కేసరి సినిమా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

యూనిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ సినిమాగా తెరకేకుతున్న ఈ సినిమా లో బాలకృష్ణ ఇదవరక్కెన్నడు కనపడని క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య ని కాస్త డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా లో బాలకృష్ణ హీరో గా నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలానే యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది.

ఇక బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాభోతున్నాడు. అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరి సినిమా లో విలన్ పాత్రలో నటిస్తున్నారు. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19 న భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు రాభోతుంది. తాజాగా ఈ సినిమా కి సంబందించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఆగస్ట్ మూడవ వారం నుండి భగవంత్ కేసరి సినిమా కి సంబందించిన హడావిడి మొదలు కాభోతుందని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన బాలయ్య ఫ్యాన్స్ ఇప్పటినుండే పండగ చేసుకుంటున్నారు .