ఆమె వల్లే సూర్య తమ్ముడు జీవితం మారిపోయిందా..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈయన తమ్ముడు కార్తీక్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తమిళంలో నటించిన పలు చిత్రాలను తెలుగులో డబ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఊపిరి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కార్తికి తెలుగులో ఖైదీ, ఆవారా, యుగానికి ఒక్కడు, నా పేరు శివ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

Tamil star Suriya rejoices as brother Karthi and his wife Ranjani welcome  their second child | Photogallery - ETimes

ఒకానొక దశలో కార్తీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడం చాలా కష్టంగా మారిపోయిందట. అలాంటి సమయంలో కార్తి భార్య ఎప్పుడూ లవ్ స్టోరీలు చేస్తే ఎలా అని కాలానికి అనుగుణంగా మారడంతో పాటు యాక్షన్ కథలను సరికొత్త కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించింది అంట. అలా తన భార్య చెప్పిన మాటలు విని బలంగా నిలబడడం జరిగిందట కార్తీక్. అలాంటి సమయంలోనే డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఖైదీ సినిమాలో నటించడం జరిగిందట.

Karthi and wife Ranjani blessed with a baby boy

ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆ తర్వాత మళ్లీ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం కార్తీ భార్య ఆ మాట చెప్పడంతో కార్తీక్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. రెమ్యూనరేషన్ కూడా ప్రస్తుతం ఒకోచిత్రానికి భారీగానే అందుకుంటున్నట్లు తెరుస్తోంది. సూర్య ,కార్తీక్ కాంబినేషన్లో ఏదైనా ఒక సినిమా వస్తే బాగుంటుంది అని అభిమానులు భావిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం కార్తీ జపాన్, ఖైదీ -2, సుల్తాన్-2 చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.