అందుకు భ‌య‌ప‌డే హీరోల‌తో రొమాన్స్ చేశానంటున్న త‌మ‌న్నా.. ఛీ కొడుతున్న ఫ్యాన్స్‌!

సుదీర్ఘకాలం నుంచి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్ప‌టికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ జైల‌ర్‌, భోళా శంక‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే ఈ రెండు సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల బాలీవుడ్ లో విడుద‌లైన‌ జీ కర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ల‌లో త‌మ‌న్నా ఎలా రెచ్చిపోయిందో గుర్తుండే ఉంటుంది.

ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ మ‌రియు ఇంటిమేట్ సీన్స్ లో న‌టించి హెడ్ లైన్స్ లో నిలిచింది. ఇంత‌క‌ముందెప్పుడూ త‌మ‌న్నా ఇంత బోల్డ్ గా న‌టించింది లేదు. త‌మ‌న్నా తెగింపుకు సొంత ఫ్యాన్స్ కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. కొంద‌రైతే డ‌బ్బు కోసం మ‌రీ ఇంత‌లా రెచ్చిపోవాలా అంటూ ఛీ కూడా కొట్టారు. అయితే తాజాగా బోల్డ్ సీన్స్ లో న‌టించ‌డం వెన‌క కార‌ణం ఏంటో త‌మ‌న్నా వివ‌రించింది.

కెరీర్ లో తొలిసారి బోల్డ్ గా నటించడం గురించి త‌మ‌న్నా ఓపెన్ అవుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. యూత్‌ను మెప్పించాలంటే అలంటి సన్నివేశాల్లో నటించాల్సిందే అని.. వారి అంచనాలకు తగ్గట్టుగా ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ఒప్పుకోవాలని త‌మ‌న్నా పేర్కొంది. ఒక వేళ తాను అలాంటి సన్నివేశాలకు ఒప్పుకోకుంటే హీరో పక్కన చెల్లిగానో లేదా ఆంటీ గానో చేసేసే వారు.. అందుకు భ‌య‌ప‌డే హీరోల‌తో రొమాన్స్ చేశాన‌ని త‌మ‌న్నా వెల్ల‌డించింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త వైర‌ల్ గా మారాయి.