అమల ప్రెగ్నెన్సీ టైమ్ లో నాగార్జున అలాంటి ప‌ని చేశాడా.. చివ‌ర‌కు డెలివ‌రీ రోజు కూడా..?

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట‌ల్లో నాగార్జున, అమ‌ల జోడీ ఒక‌టి. మొద‌టి భార్య ల‌క్ష్మితో విడిపోయిన త‌ర్వాత నాగార్జున అమ‌ల‌తో ప్రేమలో ప‌డ్డాడు. వీరిద్ద‌రూ కిరాయి దాదా, శివ చిత్రాల్లో జంట‌గా న‌టించారు. ఈ సినిమా ద్వారా ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. చివ‌ర‌కు అది పెళ్లికి దారితీసింది. 1992లో వీరిద్ద‌రూ వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు అఖిల్ జ‌న్మించాడు. అయితే తాజాగా నాగార్జున అల‌మ ప్రెగ్నెన్సీ రోజుల‌ను గుర్తు చేస్తుకుంటూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు.

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, రూప హీరోహీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో శనివారం సాయంత్రం మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ ఈవెంట్ కు నాగార్జున స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేశారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ కు త‌నవంటూ ప్ర‌మోట్ చేశారు. ట్రైల‌ర్ చాలా బాగుందని.. అసలు మగవాడు ప్రెగ్నెంట్ అవ్వ‌డం ఏంటి అనే క్యూరియాసిటీ తనలో ఉందని.. సినిమా కోసం అతృత‌గా ఎదురుచూస్తున్న‌ట్లు నాగార్జున పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలోనే మాతృత్వం గురించి నాగార్జున మాట్లాడాడు. `అమ్మ‌త‌నం అనేది చాలా అందమైన అనుభూతి. హలో బ్రదర్ సినిమా చేస్తున్న‌ప్పుడు అమ‌ల ప్రెగ్నెంట్‌. త్వ‌ర‌త్వ‌ర‌గా హ‌లో బ్ర‌ద‌ర్ ను కంప్లీట్ చేసుకుని.. ఆఖ‌రి ఆరు నెల‌లు అమ‌ల‌తోనే ఉన్నాను. ఆమెను వ‌దిలిపెట్ట‌లేదు. చివ‌ర‌కు డెలివ‌రీ రోజు కూడా ఆమె చేయి ప‌ట్టుకుని ఉన్నా. నా జీవితంలో ఏదైనా గొప్ప అనుభవం ఉందంటే ఇదే` అంటూ నాగార్జున ఆనాటి రోజుల‌ను గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌తో నాగార్జున‌కు అమ‌ల అంటే ఎంత ప్రేమో అంద‌రికీ స్ప‌ష్టంగా అర్థ‌మైపోయింది.