పవన్ కారణంగా చిరంజీవి క్షమాపణలు చెప్పాడా..అసలు ఏం జరిగిందంటే..!?

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి- పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వీరిద్దరి మధ్య అన్నదమ్ముల బంధం కంటే ఎక్కువ అనుబంధం ఉంటుంది. వీరి మధ్య చిన్నచిన్న గొడవలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ మళ్ళీ ఏదైనా స‌మ‌స్య‌ వస్తే మెగా బ్రదర్స్ అందరూ కలిసి ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఇలాంటి అన్నదమ్ముల మధ్య ఓ రోజు పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకి చిరంజీవి క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందట. ఇంతకీ ఆ విషయం ఏమిటి చిరంజీవి అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు చూద్దాం.

ఇప్పటికీ మెగా బ్రదర్స్ లో పవన్ కళ్యాణ్, నాగబాబులను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇద్దరు వాటిని పట్టించుకోకుండా తమ పనులు చూసుకుంటూ వెళ్లిపోతారు. ఇదే సమయంలో వారి ఫ్యామిలీని ఎవరైనా ఏదైనా అంటే అసలు ఊరుకోరు. అయితే ఇలాంటి సంఘటననే చిరంజీవి హీరోగా చేస్తున్న సమయంలో ఒకటి జరిగింది. చిరంజీవి స్టార్ హీరోగా ఇదిగాక చెన్నైలో ఓ ఇల్లు కనుక్కొని తన కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. అలా చెన్నై పరిసర ప్రాంతాల్లో ఓ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే ఓ రౌడీ మూకా చిరంజీవిని ప్రతిరోజు ఇబ్బంది పెట్టేవార‌ట‌.

చిరంజీవి మాత్రం వారు చేసే అల్లరిని అసలు పట్టించుకునే వాడు కాదట. వారు ఎంత అసహ్యంగా మాట్లాడిన చిరంజీవి సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్లిపోయే వారట. అయితే ఒక రోజు చిరంజీవి కారు డైవర్ ఇదే విషయాన్ని చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చెప్పాడట. ఇక దాంతో పవన్ చిరంజీవికిి తెలియకుండా ఆ అల్లరి మూక ఉండే దగ్గరికి వెళ్లి మీరు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపోండి.. ఎందుకు మా అన్నయ్యని అల్లరి చేస్తున్నారంటూ వారి మీద గొడవకి దిగారట. అయితే వారు మాత్రం నువ్వేంటి పెద్ద తోపా అంటూ పవన్ కళ్యాణ్ ని కూడా ఎగతాళి చేశారట. అంతే కాకుండా వారి మధ్య పెద్ద గొడవే జరిగిందట.

అదే సమయంలో ఆ గ్యాంగ్ లో ఉండే కుప్ప స్వామి అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ కారణంగా గాయాలు కూడా అయ్యాయట. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. హుటా హుటిన ఆస్పత్రికి వెళ్లి ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పి తన తమ్ముడు చేసిన తప్పుకు నేను సారీ చెప్తున్నాను అంటూ హాస్పటల్ ఖర్చుల కింద డబ్బులు కూడా ఇచ్చి ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ ని గట్టిగాటిగా తిట్టాడట. దాంతో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను అని సమాధానం ఇచ్చారు అయినా కూడా పవన్ కళ్యాణ్ ని వెంటబెట్టుకుని హాస్పిటల్ కి వెళ్లి ఆ వ్యక్తికి సారీ చెప్పించారట. ఇలా ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసిన తప్పు కారణంగా చిరంజీవి వాళ్లకి క్షమాపణలు చెప్పాల్సివచ్చింది.