జగన్‌కు బాబు సవాల్..ప్రజాదరణ ఎవరికి ఉంది?

దేశంలో ఏ సి‌ఎం అమలు చేయని విధంగా సి‌ఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే.  అటు అభివృద్ధిని కూడా సమానంగా చేస్తూ వస్తున్నారు. ఇలా రెండు రకాలుగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న జగన్‌కు ప్రజాదరణ ఎక్కువ ఉందా? లేక సంక్షేమ పథకాల హామీలని సగంలో ఆపేసి..అభివృద్ధిని గ్రాఫిక్స్ లో చేసి చూపించిన చంద్రబాబుకు ఆదరణ ఎక్కువ ఉందా? అంటే ఎవరైనా జగన్ పేరు చెప్పాల్సిందే. అందులో ఎలాంటి డౌట్ లేదు.

అయితే జగన్ ప్రజల్లో తిరగడం లేదని, ఆయనకు ప్రజా సమస్యలు తెలియడం లేదని, దమ్ముంటే తనతో పాటు జగన్ కూడా ప్రజల్లో తిరగాలని చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. తాజాగా మండపేట నియోజకవర్గంలో భవిష్యత్తుగా గ్యారెంటీ పేరుతో రోడ్ షో, సభ నిర్వహించిన బాబు..ఈ సవాల్ విసిరారు. మాట్లాడితే తనని తిట్టడం కాదని, ఇక్కడకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని, ప్రతి గడపకూ కలిసి తిరుగుదాం రావాలని జగన్‌కు బాబు సవాల్ చేశారు.

ఇక్కడ బాబు సవాల్ ఏ మాత్రం వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే జగన్ ప్రతి సంక్షేమ పతాక రూపంలో ప్రతి ఇంటికి చేరువయ్యారు. అయితే సి‌ఎం కాబట్టి అనేక పనులు ఉంటాయి..ప్రతి ఇంటికి జగన్ వెళ్లలేరు..అందుకే ఎమ్మెల్యేలని గడపగడపకు పంపిస్తున్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో జగన్‌కు ప్రజాదరణ ఎక్కువగానే ఉంది.

ఇటీవల విడుదల చేసిన నేషనల్ సర్వేల్లో జగన్‌కు ప్రజాదరణ ఎక్కువ ఉందని తేలింది. దాదాపు 51 శాతం మద్ధతు జగన్‌కు ఉందని, కేవలం 36 శాతం చంద్రబాబుకు ఉందని, అటు పవన్‌కు 10 శాతం మద్ధతు ఉందని తేలింది. కాబట్టి బాబు-పవన్ కలిసిన సరే జగన్‌ని దాటలేరు.